అమెజాన్ ప్రైమ్ లో లేటెస్ట్ వెబ్ సిరీస్ `పాతాళ్ లోక్` (పాతాళ లోకం) నటీనటుల ప్రదర్శనపై ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సిరీస్‌లో నీరజ్ కబీ, గుల్ పనాగ్, జైదీప్ అహ్లవత్ వంటి గొప్ప నటులు ప్రధాన పాత్రలో నటించారు.సిరీస్ లో ప్రతిపాత్రా దేనికదే ప్రత్యేకంగా ఉందని.. ముఖ్యంగా జైదీప్ .. నీరజ్ నటన కట్టిపడేసిందని ఆలియా ప్రశంసించింది. మనోజ్ భాజ్ పాయ్.. అనురాగ్ కశ్యప్ లాంటి టాప్ స్టార్లు ఈ సిరీస్ ని విపరీతంగా పొగిడేయడం విశేషం.
ఈ సిరీస్ కి ప్రఖ్యాత రచయిత సుదీప్ శర్మ స్క్రిప్టు అందించారు. ఇంతకు ముందు `సోంచిరియా`, `ఉడ్తా పంజాబ్`.. ఎన్ హెచ్ 10 వంటి కొన్ని మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలకు కథలు అందించారాయన. ఈ సిరీస్ కు ప్రోసిత్ రాయ్, అవినాష్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు అనుష్క శర్మ నటించిన `పారి` చిత్రానికి ప్రోసిత్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ సిరీస్ లో ఎద్దు కన్నుకు గాయం అయినట్టు చూపించడం ప్రస్తుతం వివాదం రేపుతోంది. దీనిపై ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ (ఎన్.హెచ్.ఆర్.సి)లో ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు సిరీస్ `పాతాళ్ లోక్` నిర్మాతలు ఇబ్బందుల్లో పడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన గూర్ఖా కమ్యూనిటీ..ఆప్జియా ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్ వాళ్లు హెచ్ ఆర్.సీలో ఫిర్యాదు చేశారు. త్వరలోనే మేకర్స్ ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.