బాలీవుడ్లోని ప్రముఖ నటీమణులలో అలియా భట్ రేంజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ప్రారంభ రోజుల్లో తీవ్రంగా విమర్శలెన్నో ఎదుర్కొన్న అలియా దానిని సవాల్ గా తీసుకుని ఎన్నో ఛాలెజింగ్ పాత్రలు చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. అగ్ర నటీమణుల జాబితాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత అలియా భట్ తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న సంగతి విధితమే. ఈ బ్యూటీ ఇటీవల తన సోషల్ మీడియాల్లో కామెంట్లను పరిమితం చేసింది. అలియా భట్ అలాగే తన సోదరి షాహీన్ లపై సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లను తాజాగా పంచుకున్నారు.
ఇది సైబర్ నేరం. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని షాహీన్ చెప్పారు. చాలా మంది ఖాతాలు అనామకంగా ఉండవచ్చు కానీ వారి ఐపీ చిరునామాలతో వాటిని గుర్తించవచ్చని ఆమె అన్నారు. వేధింపులు నేరం అని ఆమె అన్నారు. స్క్రీన్షాట్లతో పాటు షాహీన్ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
సామాజిక మాధ్యమాల్లో మమ్మల్ని బెదిరించారు. అత్యాచారం చేస్తామని.. చంపేస్తామని బెదిరించారు. తమ కుటుంబాన్ని దోపిడీ చేస్తామని అన్నారు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని షాహీన్ నిర్ణయించుకున్నాడు. అలియా భట్ ఈ విషయాల్ని వెల్లడించారు. తన రాబోయే చిత్రం సడక్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ పైనా విమర్శలు వెల్లువెత్తిన సంగతి విధితమే. నెటిజనుల్లో ఒక సెక్షన్ జనం ఈ చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునివ్వడం సంచలనమైంది.