Rise of Ram: రాంచరణ్ ‘రైజ్ఆఫ్ రామ్’ సాంగ్ అదిరిపోయిందిగా..

Rise of Ram: ‘రైజ్ఆఫ్ రామ్’ మ్యూజిక్ వీడియోను ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ న్యూ ఇయర్ స్పెషల్ గా ఒకరోజు ముందుగానే విడుదల చేసింది. రామం రాఘవం అంటూ సాగిన పాట అల్లూరి సీతారామరాజు పోరాట నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా అద్భుతంగా కనిపించాడు. కాగా, ఈ పాటకు శివ దత్త లిరిక్స్ అందించగా.. విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, హరి హరన్ కలిసి అద్భుతంగా పాడారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి బాణీలు అందించారు.

ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మల్టీ స్టారర్ గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రని రాంచరణ్ పోషిస్తుండగా, కొమరంభీం పాత్రని జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా గా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని దర్శకధీరుడు ‘జక్కన్న’ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ నటి నటులు అలియాభట్, అజయ్ దేవగన్ లు కీలకపాత్రలను పోషించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.

YouTube video player