ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న విడుదల అని ప్రకటించేశాడు. అంతేకాదు ప్రమోషన్స్ జోరు కూడా పెంచారు.
ఈ నేపధ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆడియో రిలీజ్ ను కడపలో విడుదల చేస్తామని ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కడపలో భారీ బహిరంగ సభలో ఈ వేడుకను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ‘‘వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్’’గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఆడియో రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వర్మ అన్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది ..ఈవెంట్ పేరు
“వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్ .
ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచెయ్యబడుతుంది ..జై ఎన్టీఆర్ #LakshmiNTR pic.twitter.com/ocVYUrkD6t
— Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2019
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడపలో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది.. ఈవెంట్ పేరు ‘వెన్ను పోటు’ అలియాస్ ఎన్టీఆర్ నైట్. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచేయబడుతుంది.. జై ఎన్టీఆర్’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అగస్త్య మంజుతో కలిసి వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మాతలు.