నేను ముదురు నా కొడుకుని…: ఆర్జీవీ

“ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు, నేను ముదురు నా కొడుకుని…మిగతా వాళ్లు రకరకాల వేరే వేరే రకాల నాయకులు, వెన్ను పోటు నాయకులతో సహా… ” అంటున్నారు వర్మ.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాదస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌‌, రెండు పాటలు రిలీజ్ చేసిన ఆర్జీవీ సినిమాపై అంచనాలు పెంచుకుంటూ పోతున్నాడు. అంతేకాదు అంచనాలు రెట్టింపు అయ్యేలా ట్విట్టర్‌‌లో రోజుకో ఫొటో పోస్ట్ చేస్తూ సంచలనం రేపుతున్నాడు.

ఈ నేపధ్యంలో ఈ సినిమా ఆపాలని తెలుగుదేశంకు చెందిన ఎమ్మెల్యే ఒకరు వర్మ పై కోర్టుమెట్లెక్కిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి నోటీసులు వచ్చిన తర్వాత వర్మ ఏం చేశాడన్న సంగతి ప్రక్కన పెడితే.. ఈ సినిమాను కచ్చితంగా అడ్డుకుని తీరతామని ఆర్జీవీకి వార్నింగ్ లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా మరోసారి రెచ్చిపోయారు.

మరో ట్వీట్ లో .. ” ఏయ్… లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్‌‌కు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్డార్” అంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చేతిలో కత్తిపట్టుకుని ఉన్నట్లున్న ఓ మార్ఫింగ్ ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు.

ఇక ట్విట్టర్ లో కామెంట్స్ అయితే ఓ రేంజిలో ఉన్నాయి. “వీడు మగాడురా బుజ్జి….” అని కొందరు అభిమానులు కామెంట్ చేయగా.. మరికొందరు ‘మేం అడ్డుకోం సార్’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.