‘గీతా గోవిందం’ పాప..భీష్ముడుని గిల్లుతోంది

రీసెంట్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం గీతా గోవిందం. ఈ చిత్రం విజయ్ కు ఎన్ని మార్కులు పడ్డాయో…అందుకు ఒక మార్కు ఎక్కువై హీరోయిన్ గా చేసిన రష్మిక కు పడ్డాయ. దాంతో ఇప్పుడు రష్మిక కు వరస ఆఫర్స్ తో మునిగితేలుతోంది. తాజాగా ..ఆమె నితన్ సరసన ఎంపికైంది.అందులో నితన్ పాత్ర జీవితాంతం పెళ్లి చేసుకోని భీష్ముడు టైప్ పాత్ర.  ఆ క్యారక్టర్ ని ముగ్గులోకి దింపటానికి ట్రై చేసే గమ్మత్తైన పాత్రలో రష్మిక కనిపించబోతున్నట్లు సమాచారం.

ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఛలో సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ  చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నారు. ప్రేమకథకు వినోదాన్ని జోడించి వెంకీ కుడుముల సిద్ధంచేసిన కథ నచ్చడంతో నితిన్  వెంటనే ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. సింగిల్ ఫరెవర్ అనే ఉపశీర్షికను నిర్ణయించినట్లు తెలిసింది.
 

ఆజన్మబ్రహ్మచారిగా ఉండిపోవాలని కలలుకనే ఓ యువకుడి కథతో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాసం ఉంది.