బ్రేక‌ప్‌పై ర‌ష్మిక వివ‌ర‌ణ‌

                                              (ధ్యాన్)

కిర్రాక్ పార్టీ చిత్రంతో స‌క్సెస్ కొట్టి.. ఆ చిత్ర హీరోతో ప్రేమ‌లో ప‌డి నిశ్చితార్థం వ‌ర‌కు వెళ్లారు ర‌క్షిత్‌, ర‌ష్మిక‌. కాని కొన్ని కార‌ణాలు వ‌ల్ల ఇద్దరి ఎంగేజ్‌మెంట్ బ్రేక‌ప్ అయ్యింది. ర‌క్షిత్ అభిమానులు ర‌ష్మికను సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేసిన‌ప్పుడు ర‌క్షిత్ ర‌ష్మిక‌ను స‌పోర్ట్ చేస్తూ మెసేజ్ చేయ‌డ‌మే కాకుండా ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి ఇబ్బంది క‌లుగ చేయ‌వ‌ద్ద‌ని కోరాడు. ఇప్పుడు ర‌ష్మిక బ్రేక‌ప్ గురించి నోరు విప్పింది. ట్విట్ట‌ర్ వేదికగా ర‌ష్మిక స్పందించింది. “సోష‌ల్ మీడియాలో నాపై వ‌స్తున్న ట్రోలింగ్స్ నన్ను త‌ప్పుగా చూపిస్తున్నాయి. ఈ విష‌యాల‌పై నేను మిమ్మ‌ల్ని వేలెత్తి చూప‌డం లేదు. ఎందుకంటే మీరు అలాంటి వాటినే న‌మ్ముతారు. మీకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ర‌క్షిత్‌, నేనే కాదు.. ఎవ‌రూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడ‌దు. నాణానికి రెండు వైపులున్నట్లు ప్ర‌తి క‌థ‌కు రెండు రూపాలుంటాయి. మా ప‌నిని ప్ర‌శాంతంగా చేసుకోనివ్వండి నేను తెలుగు, క‌న్న‌డ ఇండ‌స్ట్రీల్లో సినిమాలు చేస్తాను. నా బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను“ అంటూ ట్వీట్ చేశారు.