కన్నడంలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక మందన్నా.. ఈ అమ్మడు కన్నడలో `కిర్రాక్ పార్టీ`తో సక్సెస్ అందుకుంది. తెలుగులో ఛలో, గీత గోవిందం సినిమాలు చేసింది. ఈ రెండు కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. దీంతో రష్మిక లక్కీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం తెలుగులో నాగార్జున, నాని మల్టీస్టారర్ `దేవదాస్`తో పాటు.. విజయ్ దేవరకొండ `డియర్ కామ్రేడ్` చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది. హీరోయిన్‌గా మంచి గ్రాఫ్ ఉన్న తరుణంలో రష్మిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ఆమెకు ఇబ్బందికరంగా మారింది. అదేంటంటే.. రష్మిక తొలి చిత్రం కన్నడంలో `కిర్రాక్ పార్టీ` హీరో రక్షిత్‌తో ప్రేమలో పడింది. నిశ్చితార్థం కూడా అయింది. రెండేళ్లలో పెళ్లి కూడా అనుకున్నారు. అయితే కొన్ని రోజుల ముందు ఇద్దరికీ బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి. అదంతా ఏం లేదని ఆమె మేనేజర్ ఖంఢించాడు కూడా. కానీ ఆమె ప్రకటించినట్టు రక్షిత్, రష్మిక మధ్య వ్యవహారం బాగా లేదట. బ్రేకప్ అయిన మాట వాస్తవమే అని సమాచారం.