కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన రష్మిక మందన !

ఈ హీరోయిన్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్ చేస్తోంది. ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసింది రష్మిక. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ..తన కాబోయే భర్త నిజాయితీపరుడై ఉండాలని..అతని ప్రవర్తన నచ్చాలని చెప్పింది. అంతేకాదు కాబోయే భర్తకు మంచి మనస్సు గల వాడై ఉండాలని, అతనితో కలిసి ఎక్కువ సమయం ఉండాలనిపించాలని నన్ను బాగా చూసుకోవాలి .

రష్మిక తన కోస్టార్ రక్షిత్‌ శెట్టిని 2017లో నిశ్చితార్థం చేసుకోగా..గతేడాది సెప్టెంబరులో వీరిరువురి నిశ్చితార్థం రద్దైన విషయం తెలిసిందే.