టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారాతెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నాగశౌర్య అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఈయన తాజాగా నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో నాగశౌర్య బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో కనిపించడంతో ఈ సినిమా అచ్చం నాని నటించిన అంటే సుందరానికి సినిమాని పోలి ఉందని చాలామంది భావించారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై నాగశౌర్య స్పందించారు ఇప్పటికే అదుర్స్ అంటే సుందరానికి వంటి సినిమాలలో హీరోలు బ్రాహ్మణ అబ్బాయిలగా కనిపించారు. అయితే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో కనిపించిన అన్ని కథలు ఒకేలా ఉండవని దేనికదే భిన్నంగా ఉంటుందని నాగశౌర్య వెల్లడించారు.ఇక ఈ సినిమాలో ఎంతో అద్భుతమైన రొమాంటిక్ కామెడీ సన్నివేశాలు ఉన్నాయని ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నాగశౌర్య పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో రాధిక గారి పాత్ర మినహా మిగిలిన పాత్రలన్నీ చాలా హిలేరియస్ గా ఉంటాయని ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నాగశౌర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ తనకు చాలా బాగా నచ్చిందని ఈయన పేర్కొన్నారు. ఇకపోతే తను రొమాంటిక్ సన్నివేశాలలో చేయడానికి కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతానని. రొమాంటిక్ సీన్స్ చేయడంలో తాను చాలా వీక్ అంటూ ఈ సందర్భంగా నాగశౌర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన వరుడు కావలెను, లక్ష్య, అశ్వత్థామ వంటి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలు పెద్దగా హిట్ సాధించలేకపోయాయి. ఇక కృష్ణ వ్రింద విహారి కూడా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.