నైట్ కు రమ్మంటున్నాడు,అమ్మాయి సెక్స్ చేస్తే తప్పా?: రష్మీ

నైట్ కు రమ్మంటున్నాడు,అమ్మాయి సెక్స్ చేస్తే తప్పా?: రష్మీ

తెలుగు సినిమాలు చూసే వాళ్లకు, టీవీలో జబర్దస్ద్ వీక్షించేవారికి రష్మీ గౌతమ్ పరిచయమే. ఎంతమంది టెలివిజన్ మీడియాలో వచ్చి వెళ్లినా తన దైన స్టైల్ లో గుర్తింప తెచ్చుకుని పాపులరైందీ ఈ భామ. ఎక్సపోజింగ్, యాంకరింగ్ కలిపి చేస్తున్నట్లుగా గ్లామర్ ప్రదర్శన చేసే రేష్మి అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ క్రేజ్ సంపాదించుకుంది.

ఆ మద్య రష్మీ నటించిన గుంటూరు టాకీస్ అయితే కేవలం ఆమే క్రేజ్ తో ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె యాంకరింగ్ చేస్తోన్న జబర్దస్త్ షో.. తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ప్రోగ్రామ్‌గా హైయిస్ట్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమె చేసే కామెంట్స్ కు, పోస్ట్ లకు రచ్చ మామూలుగా ఉండదు. ఇంతలా క్రేజ్ తెచ్చుకోవటం ఆమెకు సంతోషమే కానీ ఒక్కోసారి సమస్యలను తీచ్చిపెడుతోంది.

వివాదలను తన ప్రక్కన ఉంచుకునే ఆమె మరోసారి న్యూస్ లోకి వచ్చింది. తన అభిమానులతో లైవ్ వీడియో ఛాట్ చేసింది. ఓ వ్యక్తి తనతో ఓ రాత్రి గడపమన్నారని బయిటపెట్టింది. ఈ యాంకర్ కమ్ నటి రీసెంట్ గా ఆన్ లైన్ లో ఓ లైవ్ వీడియోలో మాట్లాడుతూ స్త్రీలు తనతో పాటు చాలా మంది అసభ్యకరమైన రకరకాల ప్రశ్నలతో , సెక్యువల్ ప్లెజర్స్ అడుగుతున్న వారితో ఇబ్బంది పడుతున్నామని చెప్పింది. అటువంటి వ్యక్తులపై ఆమె మండిపడుతూ…అయితే వాళ్లను తాను కేర్ చేయనని అంది.

అవేమీ తననేమీ చెయ్యలేమని అంటోంది. అయితే అందరూ తనలాగ ధృడంగా ఉండే అమ్మాయిలు ఉండరు కాబట్టి ఆందోళగా ఉందని అంటోంది. అలాంటి వాళ్ల కోసమే తాను మాట్లాడాల్సి వస్తోందని వివరించింది. తనను ఓ వ్యక్తి తనతో ఓ రాత్రి గడుపుతావా అని అడిగాడని, అయితే అలా పబ్లిక్ లో ఇలా స్టుపిడ్ గా మాట్లాడేవాళ్లతో ఎవరైనా ఉండగలరా..ఆ మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచించే తెలివి లేదా అని నవ్వేసింది. అంతేకాదు కేవలం ఆడవాళ్లనే మీరు వర్జినా అని అడుగాతారని, అదే మగవాళ్లను ఎందుకు అడగరని అని ప్రశ్నలు వేస్తోంది. ఆడవాళ్లు సెక్స్ ఎంజాయ్ చేయటాన్ని ఎందుకంత పెద్దది చేసి మాట్లాడతారు..అదేమన్నా తప్పా అంది.