చెర్రీ వ‌దిలేస్తే… ప్ర‌భాస్ త‌గిలించుకున్నాడా?

 
(ధ్యాన్)
 
 ప్రభాస్ చేస్తున్న త‌ప్పు అంతా ఇంత‌టిది కాదు. ఆయ‌న అభిమానులంద‌రూ ఇప్పుడు ప్ర‌భాస్ త‌ప్పు గురించి ఎలా ఎత్తి చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. అయినా అలా ఎందుకు చేయాల్సి వ‌స్తోంద‌ని విచారిస్తున్నారు. ఇంత‌కీ ప్ర‌భాస్ చేస్తున్న త‌ప్పు ఏంటి? అనేగా మీ అనుమానం… ఆయ‌న త‌దుప‌రి సినిమాలో సంగీత ద‌ర్శ‌కుడిగా ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ను పెట్టుకోవ‌డం. ఎ.ఆర్‌. రెహ‌మాన్ జంట ఆస్కార్‌ల‌ను గెలుచుకుని ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించి ఉండ‌వ‌చ్చు. కానీ ఆయ‌న తెలుగు సినిమా నేరుగా చేస్తే ఆ సినిమా ఫ్లాపే. ఇప్ప‌టికే ఆ విష‌యాన్ని ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. ఆయ‌న డ‌బ్బింగ్ సినిమాలు మాత్ర‌మే బాగా క‌లెక్ట్ చేశాయి. ఇటీవ‌ల `సైరా` సినిమాకు ముందు రెహ‌మాన్‌నే మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌గా అనుకున్నారు. అయితే టీజ‌ర్‌కి కావాల‌ని త‌మ‌న్ చేత రీరికార్డింగ్ చేయించ‌డంతో రెహ‌మాన్ హ‌ర్ట‌య్యాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కూడా రెహ‌మాన్‌ని అనుకోవ‌డ‌మైతే అనుకున్నారు కానీ.. సెంటిమెంట్ ప‌రంగా సంతృప్తిగా లేరు. దాంతో ఆ ప్లేస్‌లోకి త్రివేదిని తీసుకున్నారు. అలా రామ్‌చ‌ర‌ణ్ రెహ‌మాన్‌ని వ‌దిలించుకుంటే.. ప్ర‌భాస్ త‌గిలించుకున్న‌ట్ట‌యింది. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా యువీ క్రియేష‌న్స్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌బోయే సినిమాకు రెహ‌మాన్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకున్నార‌ట‌. సో ఇప్పుడు రెహ‌మాన్ అఫిషియ‌ల్‌గా ప్ర‌భాస్‌కి మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌. ఆయ‌న గ‌త చ‌రిత్ర రిపీట్ అయితే మాత్రం… ఇన్ని కోట్లు గంగ‌లో పోసిన‌ట్టే అవుతుంద‌న్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే.