‘రణరంగం’ సినిమా రిలీజ్ వాయిదా పడనుందా ?

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా రణరంగం. శర్వ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ విషయంలోనూ చాలా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ సెప్టెంబర 6 న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కావటం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పెండింగ్ ఉండటంతో సినిమా వాయిదా పడటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు ఇందులో కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌లు హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.