బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన నటుడు రానా. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రానా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల 18న చికాగోలో రానాకి సంక్లిష్టమైన కిడ్నీ సర్జరీ పూర్తైందట.
ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని, మూడు నెలల తర్వాత రానా యాక్షన్ మొదలు పెట్టనున్నాడని అంటున్నారు. ఇటీవల హథీ మేరే సాథి చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న రానా విరాట పర్వం చిత్రంలో నటించనున్నాడు. ఇందులో కథానాయికగా సాయి పల్లవి నటిస్తుంది.