టాలీవుడ్ హంక్ రానా-మిహికా బజాజ్ నిశ్చితార్ధం ఈనెల 21 నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని సింపుల్ గా కానిచ్చేసారు. వరుడు-వధువుల తరుపు అతితక్కువ మందే ఈ వేడుకలో పాల్గొన్నారు. కేంద్ర -రాష్ర్ట ప్రభుత్వాలు సూచించిన నిబంధనలను పాటిస్తూ ఎంగేజ్ మెంట్ ని మమా అనిపించారు. ఈ నేపథ్యంలో వివాహం ఎప్పుడు జరుగుతంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది. సురేష్ బాబు ఈ ఏడాదే అని ప్రకటించిన అందులో స్పష్టత రాలేదు. ఓ వైపు వైరస్ వ్యాప్తి తగ్గలేదు. లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. ప్రస్తుత లాక్ డౌన్ 5.0 జూన్ 30 వరకూ అమలులో ఉంటుంది.
ఈ నేపథ్యంలో పెళ్లి ఈ ఏడాది ఉంటుందా? ఉండదా? అని చాలా సందేహాలు రేకెత్తాయి. ఘనంగా పెళ్లి చేసుకోవాలంటే వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయక తప్పదని చాలా మంది భావించారు. అయితే ఈ జంట అప్పటివరకూ ఆగడం లేదు. ఈ ఏడాదిలోనే ఇద్దరు కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి కి ఆగస్టు 8వ తీదీగా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే పెళ్లి డెస్టినేషన్ తరహాలో జరుగుతుందా? లేక హైదరాబాద్ లోనే సింపుల్ గా కానిచ్చేస్తారా? అన్నది చూడాలి. ఆగస్టు అంటే ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఈలోపు వ్యాక్సిన్ అయితే రాదు. కాబట్టి నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు.
అదీ ఆ పెళ్లి హైదరాబాద్ లోనో…దేశంలో ఇతర రాష్ర్టాన్ని మాత్రమే వేదికగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ విమాయానాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక రానా వ్యక్తిగత విషయానికి వస్తే ప్రచారానికి దూరంగా ఉండే వ్యక్తి. హంగులు ఆర్బాటాలు అంటూ హడావుడి చేసే వ్యక్తిత్వం గలవాడు కాదు. సింపుల్ గా ఉండే డౌన్ టు ఎర్స్ పర్సన్ అన్న సంగతి తెలిసిందే.