ఆ మధ్య ఓ రాజకీయనాయకుడు సన్నిహితుల వద్ద అన్నాడు..ఏదో ఓట్లు కోసం పబ్లిసిటి చేసుకోవచ్చు అని కానీ లేకపోతే ఈ ఫేస్ బుక్, ట్విట్టర్ లని బ్యాన్ చేసేద్దుము అని. అవును సోషల్ మీడియాలో ఎవరి నోటికి హద్దు ఉండదు. ఎవరు ఎవరిమీదైనా విరుచుకుపడచ్చు. వెటకారాలు చేసేయచ్చు. కారాలు నూరేయచ్చు. ఇప్పుడు రానా కు అలాంటి వెటకారాలే ఎదురౌవుతున్నాయి.
అదెలా అంటే…’బాహుబలి’లో విలన్ పాత్ర భళ్లాళదేవతో పాపులర్ అయిన రానా ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు నాయుడుగా కనిపించబోతున్నారు. ఈ మేరకు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కొన్ని ఫొటోలు బయిటకు వచ్చాయి. ఆ ఫొటోల్లో అచ్చం చంద్రబాబు నాయుడు యూత్ లో ఉండగా ఎలా ఉండేవాడో అలాగే రానాని మేకప్ చేసారు.
అక్కడవరకూ పూర్తి సక్సెస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందరూ ఫుల్ హ్యాపీ. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ప్రతిపక్షాలు ఉంటాయి కదా..వాళ్లు ఖాళీగా ఉండరు కదా. వాళ్లు…ఫెరెఫెక్ట్ ఎంపిక ..రానా ..బాహుబలి సినిమాలోనూ విలనే..ఈ ఎన్టీఆర్ బయోపిక్ లోనూ విలనే అంటున్నారు.
అదేంటి రానా వేస్తోంది చంద్రబాబు నాయుడు పాత్ర కదా వేస్తోంది అంటే..అవును ..ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన పాత్రకు విలన్ గా పాపులర్ అయిన నటుడుని తీసుకోవటం న్యాయమే అంటూ వెటకారం చేస్తున్నారు. ఎవరెన్ని వెటకారాలు అయినా చెయ్యచ్చు. చరిత్రలో ఏం జరిగిందనేది ప్రక్కన పెట్టచ్చు..కానీ రానా మాత్రం ఆ పాత్రలో జీవించబోతున్నాడనేది నిజం. బాలయ్య హీరోగా నటించే సినిమాలో తన తండ్రి,తన వియ్యంకుడు పాత్రపై ఎందుకు నెగిటివ్ ఉంటుంది. జనాలు తమ కడుపు మంట చల్లార్చుకోవటానికి ఏవో వేళాకోళాలు చేసుకోవటం కాకపోతే..ఏమంటారు.