జపాన్ లో రానా తుఫాన్

అవును ..ఇప్పుడు జపాన్ లో దగ్గపాటి రానా సినిమాల తుఫాను వస్తోంది అక్కడ వరస పెట్టి ఆయన సినమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన చిత్రాలు జపాన్‌లో విడుద‌ల కాగా, ఆ చిత్రాల‌కి ప్రేక్ష‌కుల నుండి భారీ రెస్పాన్స్ రావటం కలిసొచ్చింది. అంతేకాదు చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శకుడు రాజ‌మౌళి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ప్ర‌భాస్‌, రానాల‌తో పాటు ముఖ్య పాత్ర‌లు పోషించిన సుబ్బరాజు వంటివారికి సైతం జ‌పాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయంది. అది అక్కడితో ఆగటం లేదు.

భ‌ళ్ళాల‌దేవుడు రానా కెరీర్‌లో హిట్ చిత్రాలుగా నిలిచిన కృష్ణం వందే జ‌గద్గురు, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు జూన్ 29,2019న జ‌పాన్‌లోని స్కిప్ సిటీ కౌవాగుచ్చిలో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యాయ‌ట‌. జపాన్‌కి చెందిన ఓ వ్య‌క్తి ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్స్‌తో ఈ విష‌యాన్ని తెలిపాడు. రానా జ‌పాన్ అభిమాని పోస్ట్‌ని షేర్ చేస్తూ త‌న‌పై ఇంత ప్రేమ‌ని కురిపిస్తున్న జ‌పాన్ అభిమానుల‌కి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

రానా ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. నీది నాది తో హిట్ కొట్టన వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.