మ‌హేష్ రికార్డును రామ్ బ్రేక్ చేస్తాడ‌ట‌

మ‌హేష్ రికార్డును రామ్ బ్రేక్ చేస్తాడ‌ట‌

సోష‌ల్ మీడియాలో ఏది ప్ర‌చార‌మైతే అదే నిజం అని న‌మ్మేసే ప‌రిస్థితి ఉంది. అందులో వాస్త‌వాల కంటే అవాస్త‌వాలే ఎక్కువ‌గా ప్ర‌చారం అయిపోతున్నాయి. ఆ కోవ‌లోనే ప్ర‌స్తుతం `ఇస్మార్ట్ శంక‌ర్` కి హైప్ చేస్తూ వ‌చ్చిన ఓ వార్త ట్రేడ్ విశ్లేష‌కుల‌నే విస్మ‌య ప‌రుస్తోంది. ఆ వార్త సారాంశం ఏమంటే రామ్ న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ త్వ‌ర‌లోనే మ‌హేష్ న‌టించిన `పోకిరి` రికార్డును కొట్టేస్తోంది అంటూ ప్ర‌చారంలో వేడెక్కించేస్తున్నారు.

ముఖ్యంగా నైజాంలో పోకిరి రికార్డ్ బ్రేక్! అంటూ ప్ర‌చారం దంచేస్తున్నారు. పూరి సినిమాలలో నైజాంలో హైయెస్ట్ క‌లెక్ట్ చేసిన సినిమా పోకిరి. నైజాం ఏరియాలో 12 కోట్లు చేసింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఓవ‌రాల్ గా ఇక్క‌డ 15 కోట్లు వ‌సూలు చేస్తుంది.. పోకిరి కంటే ఇస్మార్ట్ శంకర్…సూపర్ హిట్ కింద లెక్క! అంటూ ఒక న్యూస్ ఒక‌టి స్ప్రెడ్ అయ్యింది.

వాస్త‌వ ప‌రిస్థితి అలానే ఉందా? అంటే తొలి వీకెండ్ ఇస్మార్ట్ శంక‌ర్ తిరుగులేని వ‌సూళ్లు సాధించినా ప్ర‌స్తుతం డ్రాప్స్ క‌నిపిస్తున్నాయ‌న్న స‌మాచారం ఉంది. ఏ సినిమాకి అయినా సోమ‌వారం నుంచి అస‌లు ప‌రీక్ష మొద‌ల‌వుతుంది. రామ్ కి ఇది టెస్టింగ్ టైమ్. 30 కోట్లు .. 40 కోట్లు అంటూ పోస్ట‌ర్లు వేసినంత మాత్రాన అదంతా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ద‌క్కే షేర్ అని అనుకోలేం. ఇక‌పోతే పోకిరి రిలీజై ఇప్ప‌టికే రెండు ద‌శాబ్ధాలు అయ్యింది. ఆ సినిమాతో పోల్చేస్తూ ఇస్మార్ట్ శంక‌ర్ రికార్డుల గురించి మాట్లాడ‌డం కూడా కామెడీనే అనిపించుకుంటుంది. అయితే ప్ర‌చారంలో ఆర్జీవీ- పూరి- ఛార్మి బృందం ఇలాంటి జిమ్మిక్కుల‌ను బాగానే స్ప్రెడ్ చేస్తుంటారు. దీనిని న‌మ్మ‌లేం.

ఇక‌పోతే మ‌హేష్ పోకిరి అప్ప‌ట్లో ఫుల్ ర‌న్ లో 40 కోట్ల వ‌సూళ్ల‌తో ఇండ‌స్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఆ మొత్తం ఇప్పుడు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే 100 కోట్ల షేర్ తో స‌మానం. అంటే ఇస్మార్ట్ శంక‌ర్ 100 కోట్లు తెస్తేనే పోకిరి అంత విజ‌యం సాధించిన‌ట్టు. ఇస్మార్ట్ శంక‌ర్ ఓవ‌రాల్ గా 40 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డ‌మే చాలా క‌ష్టం అన్న‌మాట కూడా మ‌రోవైపు వినిపిస్తోంది.