చేతుల‌కి గాజులు తొడుక్కోలేదు..ఎవ‌డొస్తాడో ర‌మ్మ‌నండి!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ వివాదాస్ప‌ద చిత్రాలు..వివాదాస్ప‌ద డైలాగులు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ముక్కుసూటి మ‌నిషి. ఆయ‌న సినిమా చేస్తే వివాదం..మాట్లాడితే వివాదం. అడుగేస్తే వివాదం..అడుగు తీస్తే వివాదం.. రోడ్డెక్కితే వివాదం..చివ‌రికి ఏసీ వేసుకుని ప్ర‌శాంతంగా ఆఫీస్ లో కూర్చున్నా వివాదామే! ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులకు- ఆయ‌న‌కు మ‌ధ్య ఓ వివాదం న‌డుస్తోంది. అదే `ప‌వ‌ర్ స్టార్` వివాదం. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ జీవితాన్ని ఉద్దేశించి ఆయ‌న ప‌వ‌ర్ స్టార్ టైటిల్ తో సినిమా చేసాడు. అది ఇప్పుడు రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల రిలీజ్ తో అభిమానులు వ‌ర్మ‌పై మండిప‌డ్డారు.

ఇక తాజాగా ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేయ‌డం..అది పూర్తిగా ప‌వ‌న్ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డ‌టంతో అభిమానులు ఇంకా ఎగ‌సిప‌డుతున్నారు. అయినా వ‌ర్మ స్ర్టాట‌జీని మాత్రం మార్చుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వూలో వ‌ర్మ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పారు. అలాగే ప‌వ‌న్ అభిమానులను హెచ్చ‌రించారు. `ప‌వ‌ర్ స్టార్` కేవ‌లం ఫిక్ష‌న్ సినిమానే. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థ కాదు. మిగ‌తా ఏ స్టార్ ని ఉద్దేశించి చేసిన సినిమా కాదు.  ఎవ‌ర్నీ ఉద్దేశించి కించ‌ప‌రిచి సినిమాలు చేయ‌లేదు. ప‌వ‌ర్ స్టార్ లో ఏ ఒక్క స్టార్ ని గానీ, రాజ‌కీయ నాయ‌కుడిని గానీ కించ ప‌ర‌చ‌లేదు. కేవ‌లం ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం తీసిన సినిమా.

అలాగే వార్నింగ్ లు ఇస్తే భ‌య‌ప‌డ‌టానికి ఇక్క‌డ ఎవ‌డూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేను ఒక్క‌డినే ఉన్నా. నా ఆఫీస్ అంద‌రికీ తెలుసు. గూగుల్ మ్యాప్ లో కూడా లింక్ అయింది. వెతికితే దొరుకుతుంది. రమ్మ‌నండి ఎవ‌రినైనా చూద్దాం అని ప‌వ‌న్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. మ‌రి ఈ వార్నింగ్ ల‌పై ప‌వ‌న్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు? అన్న‌ది చూడాలి. ప‌వ‌న్ అభిమానుల‌తో వ‌ర్మ‌కి ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు. గ‌తంలో ఇరువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల దాడి చేసుకున్న సంగతి తెలిసిందే.