రామారావు  జీవితంలో చీకటి కోణాల ఆవిష్కరణే లక్ష్మీస్ ఎన్టీఆర్

“నాది ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం  కాదు ,  కొన్ని సంఘటనల సమాహారం మాత్రమే బయోపిక్ అంటే ఒక మనిషి పూర్తి జీవితం  ప్రతిబింబించాలి . కానీ మా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మహానటుడు , దేశం గర్వించతగ్గ నాయకుడు జీవితంలోకి  లక్ష్మి పార్వతి ప్రవేశించిన నాటి నుంచి మాత్రమే ఉంటుంది ” అని చెప్పారు రామ్  గోపాల వర్మ

రామ్ గోపాల్ వర్మ తన తాజా సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను శుక్రవారం నాడు తిరుపతిలో ప్రారంభించాడు . ఈ సందర్భంగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి అనేక విషయాలు చెప్పాడు .

సోషల్  మీడియాలో . చంద్ర బాబు పోలికలు వున్న వ్యక్తిని ముంబయి పిలిపించి   ట్రైనింగ్ ఇస్తున్నామని  ఎన్టీఆర్ పాత్ర పోషించడానికి కూడా ముగ్గురిని సెలెక్ట్ చేశామని  వారి లో ఒకరిని ఎంపిక చేస్తామని చెప్పారు . మిగతా పాత్రలకు కూడా కొత్తవారిని తీసుకుంటాము వర్మ తెలిపాడు.

ఎన్టీఆర్ జీవితంలో వాస్తవంగా జరిగిన ఘటనలే ఈ చిత్రంలో వుంటాయని , దేన్నీ వదిలి పెట్టమని అన్నాడు . తాను  భక్తుడును కాదని అయితే రామారావు గారిపైన వున్న అపారమైన ప్రేమ తనని వెంకటేశ్వర  స్వామిని  దర్శించడానికి ప్రేరేపించింది చెప్పాడు . తాను  గతంలో తీసిన “గోవిందా గోవిందా “సినిమా అప్పుడు తిరుపతి వచ్చానని , అయితే అప్పుడు దేవుడి నగలను ఎలా కొట్టెయ్యాలో అనే ఉద్దేశ్యంతో అక్కడికి వచ్చానని అన్నాడు . శ్రీవారి ఆలయంలో వెళ్ళాక గతంలో  తాను చేసిన వ్యాఖ్యలకుపూజారులంతా తన   మీద పడి కొడతారేమో అని భయ పడ్డానని , కానీ వారు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారని వర్మ చెప్పాడు

తాను  స్వామిని ఒకటే కోరుకున్నానని , తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మాత్రమే విజయ వంతం చెయ్యమని  మనస్ఫూర్తిగా ప్రార్దించానని అన్నారు . ఎవరు ఏమనుకున్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎవరి రాజకీయ ప్రయోజనం కోసం తీస్తున్న సినిమా కాదు . రామారావు గారంటే నాకు అపారమైన అభిమానం , ఆరాధనా భావం , ఆయన జీవితంలో వెలుగు చూడని చీకటి కోణాలున్నాయని నాకు అనిపించింది . అందుకే నేను ఈ సినిమా తీస్తున్నా , దీనిని జనవరి 24న విడుదల చెయ్యాలనే సంకల్పంతో వున్నాం. ఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడ ముగుస్తుందో  అక్కడ నుంచి మా సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమా , మా సినిమా కలిస్తే ఎన్టీఆర్ నిజమైన బయోపిక్ అని చెప్పారు వర్మ .