రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎవరి వృత్తిలో వారు బిజీ బిజీగా గడుపుతుంటారనే సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఏ మాత్రం తీరిక సమయం దొరికినా ఆ కొద్ది సమయాన్ని సంతోషంగా గడిపేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే రామ్ చరణ్ కు తన భార్య అంటే ప్రాణం. ఆమె ఏం చెప్పినా తీసిపారేయడని తెలిసిన వారు చెప్తూంటారు. ఇప్పుడీ టాపిక్ ఎందుకూ అంటే..మరోసారి రామ్ చరణ్ కెరీర్ లో ప్రత్యేకంగా మాట్లాడుకునేలా అతన్ని ప్రేరేపించినందుకు.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ను ‘వినయ విధేయ రామ’లో తెరపై చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. అభిమానులు కానివారు సైతం అతని డెడికేషన్ కు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సీన్స్‌లో రామ్ చరణ్ బాడీని ఎలివేట్ చేస్తూ తీసిన షాట్స్‌ను పీక్స్‌లో తెరకెక్కించటం జనాలకు తెగ నచ్చేసింది. అయితే ఇలా రామ్ చరణ్ చేయటానికి వెనక ఉన్న ప్రేరణ ఆయన భార్య ఉపాసనే కావటం విశేషం. ఆమె వెనకే ఉండి ఫిజికల్ ట్రైనర్స్ తో మాట్లాడి రామ్ చరణ్ ని ఫిటెనెస్ దిశగా నడిపించిందని సమాచారం.
వాస్తవానికి ఈ సినిమాలో చెర్రీ బాడీని షేప్ చేయడానికి చాలానే కష్టపడ్డాడు. దీనికోసం ప్రత్యేకమైన డైట్‌ను కూడా ఉపయోగించి.. జిమ్‌లో తెగ వర్కౌట్లు చేసేశాడు. ఉపాసన.. డైట్ తాలుకా సంగతులను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉదయం 8 గంటలకు బాదం పాలు, ఓట్స్, ఎగ్స్‌ను.. 11:30 గంటలకు ఒక పెద్ద కప్పు వెజిటబుల్ సూప్‌ను, 1:30 గంటలకు 200గ్రాముల చికెన్, 3/4 కప్పు బ్రౌన్ రైస్, సగం కప్పు గ్రీన్ వెజిటబుల్ కర్రీ, సాయంత్రం 4 గంటలకు 250 గ్రాముల గ్రిల్లిడ్ ఫిష్, 200 గ్రాముల స్వీట్ పొటాటో, సగం కప్పు గ్రీన్ వెజిటబుల్స్.. ఆరు గంటలకు పెద్ద కప్పు మిక్స్‌డ్‌గ్రీన్ సలాడ్, 1/4 అవకాడో, ఒక బౌల్ నిండా గింజలు, మళ్లీ ఆరు నుంచి రాత్రి 8 గంటల వరకు ఏమైనా ఆకలి వేస్తే.. గింజలను, పచ్చి కూరగాయలను స్నాక్స్‌గా తీసుకుంటాడు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కనీసం నీళ్లు కూడా తీసుకోడంటూ.. రామ్ చరణ్ డైట్ సీక్రెట్ న వెల్లడించారు.
ఇప్పటికే ట్రైలర్‌లో చూపిన భారీ యాక్షన్ సీన్స్ మెగా ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. షూటింగ్‌లో యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించే ముందు కసరత్తులు చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.