‘వినయ..’ డిస్ట్రిబ్యూటర్స్ కు చెర్రి దిమ్మతిరగే ట్విస్ట్?

సంక్రాంతికి విడుదలైన రామ్ చరణ్ చిత్రం ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో నష్టం రావంటంతో దర్శకుడు, నిర్మాత,హీరో నష్టాలను పంచుకుందామనుకునన్నారు. ఆ విషయమై బోయపాటితో గొడవలు జరగటం ఇవన్ని అందరికి తెలిసున్నవే. ఆ విషయం ప్రక్కన పెడితే ఈ నష్టాల రికవరీ విషయంలో రామ్ చరణ్ ఓ చిన్న మెలిక పెట్టాడని ఫిల్మ్ నగర్ టాక్.

అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ రూ.5కోట్లు క్యాష్ రూపంలో డిస్ట్రిబ్యూటర్స్ కు ఇవ్వడట. రామ్ చరణ్ నటించే తర్వాతి సినిమా నుండి డిస్ట్రిబ్యూటర్లు ఆ నష్టాల్ని రికవరీ చేసుకోవాలని ఆప్షన్ ఇచ్చారట. అయితే సరేనన్న వాళ్లకు మరో ట్విస్ట్ పడిందిట. అది కూడా రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్.ఆర్ .ఆర్ నుంచో అనుకుంటే అక్కడ మీరు పప్పులో లెగ్ వేసినటట్లే.

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాతో డబ్బు రికవరీ చేసుకునే ఆప్షన్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇదెక్కడి ట్విస్ట్ అని డిస్ట్రిబ్యూటర్లు క్రిందా, మీదా పడుతున్నారట.

సైరా తరువాత చిరు, కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది. మరో ప్రక్క త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో, ఆ తరువాత వెంకీతో సినిమా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాకే చిరు- త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళేది. అంటే అప్పటి వరకు `వినయ విధేయ రామ` నష్టాల భర్తీ వీలు పడనట్టేగా. దీనికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకుంటారా..ఏం జరగబోతోందో చూడాలి.