రామ్ చరణ్ చేసిన పని, బోయపాటికి షాకే

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షో కే అంచనాలను అందుకోలేక చతికిలపడింది బ్లాక్ బ్లాస్టర్ మూవీ రంగస్థలం తో నటుడిగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన రామ్ చరణ్ నుండి ఇలాంటి సినిమా రావడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఈ ప్లాఫ్ ని ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేపోయారు.

ఇక సినిమా విడుదలయ్యాక ఈ సినిమా రిజల్ట్ పై స్పందించడానికి కూడా ఎవరు ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయారు. అయితే తాజాగా చరణ్ ఈ సినిమా ఫై స్పందిస్తూ ఒక లేఖను విడుదలచేశారు.

సినిమా కోసం చాలా కష్టపడ్డాం ఎంతగానో శ్రమపడి మిమ్మల్ని అలరించాలని మేము చేసిన ఈ ప్రయత్నం దురదృష్టవశాత్తు సక్సెస్ కాలేకపోయింది. మీరు చూపించే ప్రేమను ప్రేరణగా తీసుకొని ఇక ముందు మీరు మెచ్చే సినిమాలు చేసేలా కృషి చేస్తానని చరణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లెటర్ ని మీరు ఇక్కడ చదవవచ్చు.