లీక్ :బోయపాటి, రామ్ చరణ్ చిత్రం కథ ఇదే

                                                (సూర్యం)

రామ్‌చరణ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో  ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కైరా అడ్వాణీ  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని  డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.  ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌ కొత్త లుక్‌, సినిమా టైటిల్ దీపావళి వెలుగులతోపాటే వెలిగిపోతుంది. ఈ వార్త చెర్రీ అభిమానులను పండుగ చేసుకునేలా చేస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉండవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కథ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`తో ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్న‌ట్టు సమాచారం. చెర్రీ చేస్తున్న ఈ చిత్రం కథలోనూ గ్యాంగ్ లీడర్ తరహా ట్విస్ట్ ఉందని చెప్పుకుంటున్నారు.

ఇంతకీ కథేంటి?

రామ్ చరణ్  హ్యాపీగా ఏ భాధ్యతలు లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. కానీ కుటుంబం అంటే ప్రేమ..అవేశపరుడైన అతను తన ఫ్యామిలీ వైపు ఎవరైనా చూస్తే కళ్లు పీకీసే రకం. చెర్రీకి ఇద్దరు అన్నయ్యలు. ఈ లోగా ఓ ఇష్యూలో పెద్ద అన్న‌య్య (ప్ర‌శాంత్‌)ని విల‌న్ గ్యాంగ్ దారుణంగా చంపేస్తుంది. అయితే ఈ విష‌యం చెర్రీ కు తెలిస్తే ఆవేశంలో అంత పెద్ద విలన్ తో తలపడతాడని , ప్రమాదం అని ..చిన్న‌న్న‌య్య (ఆర్య‌న్ రాజేష్‌)కి విషయం తెలిసినా… బ‌య‌ట‌పెట్ట‌డ‌ు.

కానీ .. చివ‌రికి తన అన్న హత్య  విష‌యం తెలుసుకున్న త‌మ్ముడు చెర్రి… విలన్స్ ని ఎలా వేటాడి ఎలా ప‌గ తీర్చుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ అని స‌మాచారం. ఇప్పుడు అర్దమయ్యిందా గ్యాంగ్ లీడర్ తో ఈ సినిమా కథకు లింక్ ఏంటో… అయితే ఇది కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలో ఉన్న కథనే.

శరవేగంగా షూటింగ్  జరుపుకొంటున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు  తీసుకొస్తారు. వివేక్‌ ఒబెరాయ్‌తో పాటు ప్రశాంత్‌, స్నేహ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. బోయపాటి  సినిమాల తరహాలోనే ఊర మాస్  యాక్షన్‌ ఎలిమెంట్స్ తో  ఈ చిత్రం రూపొందుతోంది.