‘గంగోత్రి’లో రామ్ చరణ్ హీరో.. అలా బన్నీ లైన్‌లోకి వచ్చాడట!

Ram Charan Is The First Choice For Gangotri Movie

గంగోత్రి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్‌కు పెద్ద హీరోల కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసే అలవాటు ఉంది. అయితే ఈక్రమంలోనే ఓ టీనేజ్ కుర్రాడికి కథ సిద్దం చేశారట. ఈ కథలో చిరంజీవి కుమారుడు అయితే బాగుంటుందని సంప్రదించారట.

Ram Charan Is The First Choice For Gangotri Movie
Ram Charan Is The First Choice For Gangotri Movie

గంగోత్రి కథను చిరంజీవి కి వినిపించి రామ్ చరణ్‌ కావాలని నిర్మాత అడిగారట. అయితే చిరు మాత్రం.. రామ్ చరణ్ ఇంకా చిన్నవాడు.. చదువుకుంటున్నాడు.. ఆ మెచ్యూరిటీ రాలేదు అని తిరస్కించాడట. అయితే బన్నీ ని తీసుకోమ్మని సజెస్ట్ చేశాడట. డ్యాన్సులు చేస్తాడు, ముంబైలో యాక్టింగ్ కూడా నేర్చుకుంటున్నాడు, పైగా ఈ కథకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని చిరంజీవి సలహా ఇచ్చాడట.

ఇక చిరు ఇచ్చిన సూచన మేరకు గంగోత్రి తెరకెక్కింది. బన్నీకి మంచి పేరు వచ్చింది. డ్యాన్సులు, యాక్షన్ సీక్స్ అన్నీ బాగా చేస్తాడని పేరు రావడం, ఆర్య వంటి సక్సెస్ రావడంతో బన్నీ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే రాలేదు. ఈ విషయాలన్నీ తాజాగా నాగబాబు తెలిపాడు. నెపోటిజంపై మాట్లాడుతూ మెగా హీరోల ఎంట్రీ, వారు ఎంత కష్టపడ్డారు? ఎంత శ్రమించారు? అనే విషయాలను చెప్పుకొచ్చాడు.