ఫ్యాన్స్ కు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌! పిచ్చెక్కించింది

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తన ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచి ఆశ్చర్యపరిచారు. ‘always ram charan’ అన్న పేరుతో ఖాతాను తెరిచిన కొద్దిసేపటికే ఆ ఖాతాను పన్నెండు వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. అలాగే ఖాతాకు వెరిఫైడ్‌ అకౌంట్‌ కూడా వచ్చేసింది.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ చిత్రం కోసం మీసం పెంచిన లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి ఫొటోగా పోస్ట్‌ చేశారు. అయితే ఇంకా చెర్రీ ఎవర్నీ ఫాలో అవడం లేదు. ఇప్పటికే ఆయనకు ఫేస్‌బుక్‌ ఖాతా ఉంది. ట్విటర్‌ ఖాతా లేదు. చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసేవన్నీ ఆయన భార్య ఉపాసన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. త్వరలో ఆయన ట్విటర్‌ ఖాతాను కూడా తెరుస్తారేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ తాజా చిత్రం విషయానికి వస్తే…‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించారు. వారం రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ షూటింగ్ మొదలుపెడతారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్‌ రాజమౌళి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.