తనకు రాజకీయాలు తెలియవు, పడవు అంటూనే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్…మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. రీసెంట్ గా హిందీలో దే దే ప్యార్ దే సినిమాతో హిట్ అందుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తమిళంలో సూర్య హీరోగా రూపొందిన ఎన్‌జీకే చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం మే 31న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తాజాగా ఏర్పడబోయే మోదీ ప్రభుత్వం, బీజేపీ సక్సెస్ పై రకుల్ వ్యాఖ్యలు చేసి వార్తలకు ఎక్కింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ సంభాషిస్తూ ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రంపై తన ఆలోచనలు చెప్పింది.
రకుల్ మాట్లాడుతూ…రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదనే అంశాలపై దృష్టి పెడుతాను. తాజా పాలిటిక్స్ చూస్తే చాలా బాధగా ఉంది. రాజకీయాల్లో విపరీతమైన డ్రామ్ కనిస్తుంటుంది. టీవీ రేటింగ్‌ల కోసం పెద్ద ఎత్తున నేతలు ఫైట్ చేస్తూ కనిపిస్తుంటారు. నేటితరం పాలిటిక్స్ టీవీ సీరియల్స్‌ను మించేలా కనిపిస్తున్నాయి అని రకుల్ పేర్కొన్నారు.
విభజించి పాలించే విధానం ఆపండి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సెన్సేషనల్ కామెంట్స్ రకుల్ చేయడం రాజకీయాల్లో చర్చకు దారి తీస్తున్నది. విభజించి పాలించే విధానాన్ని బీజేపీ మానుకోవాలి. దేశమంతా ఒక్కటే అనే భావన కల్పించాలి. ప్రతీ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్ అంది.