నెటిజనులపై రకుల్ చిర్రు బిర్రు !
ఏంచేసినా తప్పేనంటే ఎవరికైనా కోపమొస్తుంది. కోపంరాదా మరి! గ్లామర్ డాళ్ రకుల్‌ప్రీత్ సింగ్ కు కూడా ఒక విషయంలో కోపమొచ్చింది. ఈ కోపం ఎవరిమీదా? అంటే నెటిజనుల మీదట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో స్టార్ హీరోలతో చకచకా సినిమాలు చేసేసి తననుమించిన హీరోయిన్ లేదనిపించుకున్న రకుల్, ఈమధ్య ఒక్క ‘హిట్టూ’ పట్టలేకపోయింది. ఖాళీలేకుండా ప్రాజెక్టులు చేస్తున్నా -కెరీర్‌కు ఊపునిచ్చే ప్రాజెక్టు ఒక్కటీ దక్కడం లేదు రకుల్‌కి.
ఈమధ్యే భారీ బడ్జెట్‌తో వచ్చిన సూర్య ఎన్జీకేలో రకుల్‌కు మంచి పాత్రే దక్కినా, ఫలితం మాత్రం దక్కలేదు. అంతకుముందు బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గణ్‌తో జోడీకట్టినా ‘పాత్రతీరుకు మించి గ్లామర్‌కు దిగిందంటూ’ విమర్శలూ తప్పలేదు. స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో రకుల్‌కు చాన్స్‌లు కనిపించటం లేదు.
బాలీవుడ్‌లో చాన్స్‌ల కోసం ఆమధ్య శృతిమించి చేసిన ఫొటో షూట్లూ -ఆమెకు ప్లస్ కాలేకపోయాయి. ‘ఈ హాట్ షూట్లు అవకాశాల కోసమే’నంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండటంతో -రకుల్‌కు చిర్రెత్తుకొస్తోందట. ‘ఇదంతా పనీ పాటు లేనివాళ్లు చేసే పని. వేరొకరిని విమర్శించడమే వాళ్లుకున్న ఏకైన పని’ అంటూ కాస్త గట్టిగానే మండిపడుతూ సమాధానాలు ఇచ్చిందట గ్లామర్ డాళ్ రకుల్‌ప్రీత్ సింగ్