ఈ రోజు ఉదయం నుంచీ రకుల్ ప్రీతి సింగ్ కామెంట్లు, ప్రతీ కామెంట్ల అన్నట్లుగా సోషల్ మీడియాలతో హంగామా మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ తనపై భగత్ అనే వ్యక్తి ట్విట్టర్లో చేసిన అసభ్య కామెంట్స్‌కు అదిరి పోయే కౌంటర్ ఇచ్చారు. అయితే అతడికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆ వ్యక్తి తల్లిని ఉద్దేశిస్తూ ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది.
వివాదానికి మూలం తాజాగా రకుల్ డెనిమ్ లుక్ లో ఓ నిక్కరు వేసుకుని దర్శనమివ్వటం. కారు లోంచి దిగిన రకుల్ ఇలా డెనిమ్ లుక్ లో వేడెక్కించటం చాలా మందికి నచ్చింది..ఓ కుర్రాడు అయితే కాస్తంత ఉషారై అతిగా స్పందించాడు. “కార్ లో సెషన్ పూర్తయ్యాక నిక్కరు వేయడం మర్చిపోయింది!“ అంటూ బూతు కామెంట్ ని పోస్ట్ చేశాడు .
అయితే ఆ కామెంట్ కు రకుల్ కు బాగా కోపం వచ్చింది. దాంతో అంతే ఘాటుగా షాకయ్యే సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ డిబేట్ గా మారింది.
“మీ అమ్మకు కూడా ఆ అలవాటు ఉన్నట్టుగా ఉంది. ఇలా ఎన్ని సెషన్స్ చేసి ఉంటుందో.. ఆ అనుభవంతోనే ఇలా అంటున్నావా?“ అనే అర్దం వచ్చేలా నీ తల్లి కూడా కారులో ఇలాంటి సెషన్స్ చాలా చేసి ఉంటుంది. ఇలాంటి సెషన్స్ గురించి మాత్రమే కాదు.. కాస్త బుద్ది కూడా నేర్చించమని ఆమెను అడుగు. మనుషులు ఇలాంటి మైండ్ సెట్‌తో ఉన్నంతసేపు మహిళలకు రక్షణ ఉండదు. కేవలం మహిళలకు సమానత్వం, రక్షణ గురించి డిబేట్లు పెట్టినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు, వారి మైండ్ సెట్ మారాలి అంటూ రకుల్ సదరు నెటిజన్ పై విరుచుకుపడింది.
దానికి అతడి తిట్టు ఫర్వాలేదు… కానీ తల్లి ఏం పాపం చేసింది? ఆమెను ఇందులోకి లాగి నీచమైన కామెంట్స్ చేయడం ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు ఎలా కామెంట్ చేసినా రకుల్ స్పందించిన తీరు ఏమాత్రం బాలేదని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.
నా నైతిక విలువల గురించి ప్రశ్నిస్తున్న వారు… ఒక ఆడకూతురు గురించి అసభ్యంగా మాట్లాడున్నపుడు ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్లారు? అలాంటి నీచమైన బుద్ది ఉన్నవారికి నా స్టైల్‌లో బుద్ది చెప్పాలనుకున్నాను. వారికి ఫ్యామిలీ ఉంటుంది… వారిపై కామెంట్స్ చేస్తే ఆ పెయిన్ ఏమిటో అర్థ అవుతుంది. విషయం అతడి తల్లి వరకు వెళితే తప్ప కుండా చెంప చెల్లుమనిపిస్తుంది అని రకుల్ తన వ్యాఖ్యలను సమర్ధించుకుంది. అదీ విషయం.