జెటాబొటా రాణీతో రాకేష్ మాష్ట‌ర్ `సీన్మా`

వివాదాస్ప‌ద కొరియోగ్రాఫ‌ర్ గా పేరు గాంచిన రాకేష్ మాష్ట‌ర్ సుప‌రిచితుడే. యూ ట్యూబ్ ఇంట‌ర్వ్లూల ద్వారా రాకేష్ మాష్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్ క‌న్నా! రెండింత‌లు ఎక్కువ‌గా ఫోక‌స్ అయ్యాడు. యాంక‌ర్ల‌నే అల్ల‌ల్లాడించి లైవ్ ఇంట‌ర్వ్యూల్లోనే త‌న‌దైన మార్క్ వేసుకున్నాడు. అత‌ని యాటిట్యూడ్…బిహేవియ‌ర్ అన్ని రొటీన్ కి భిన్నం. ఇండ‌స్ర్టీకి ఎంతో మంది కొరియోగ్రాఫ‌ర్ల‌ని అందించాన‌ని చెప్పుకోవ‌డం అత‌నికే చెల్లింది. మ‌రి ఆయ‌నకెందుకు పేరు రాలేదు? అన్న‌ది తెలియ‌దు. ఇక అత‌ని లో మంచి సేవాగుణం కూడా ఉంది. అవ‌కాశాలంటూ ఇండ‌స్ర్టీ చుట్టూ తిరిగే కొంత మందిని ఆదుకున్నాన‌ని కూడా చెప్పాడు.

ఆ విష‌యాలు ప‌క్క‌న‌బెట్టి అస‌లు సంగ‌తి లోకి వ‌స్తే! రాకేష్ మాస్ట‌ర్ కూడా ఇప్పుడు సొంత‌గా ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్థాపించి సినిమాలు చేయాల‌నుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో తొలి ప్ర‌య‌త్నంలో భాగంగా అలంకృత అనే యాంక‌ర్ హీరోయిన్ గా పెట్టి ఓ సినిమా చేస్తున్న‌ట్లు ఉప్పందింది. ఇంత‌కీ అలంకృత ఎవ‌రు అనుకుంటున్నారా? ఆమె ఎవ‌రో కాదు…గ‌తంలో రాకేష్ మాస్ట‌ర్ ని ఇంట‌ర్వ్యూ చేసిన ఓ యువ‌తి. ఆ ఇద్ద‌రి ఇంట‌ర్వ్యూ సోష‌ల్ మీడియా బాగా వైర‌ల్ అయింది. ఆ స‌మ‌యంలో రాకేష్ మాస్ట‌ర్ అలంకృత‌కి జెటాబొటా రాణి అని మ‌రో పేరు కూడా పెట్టారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మీద ట్రోల‌ర్స్ పెద్ద యుద్ద‌మే ప్ర‌క‌టించి దాడి చేసారు.

ఆ ర‌కంగా ఇద్ద‌రు బాగా ఫేమ‌స్ అయ్యారు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా `సీన్మా`అనే పేరును ప‌రిశీలిస్తున్నారుట‌. సీన్మా అనేది తెలంగాణ యాస‌లో ఉండే ప‌దం. ఇదే టైటిల్ తో ప‌లు న్యూస్ ఛాన‌ల్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ సీన్మా అనే టైటిల్ క్రేజీగా ఉంటుంద‌ని పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి సినిమా ఇతివృత్తం కూడా తెలంగాణ నేప‌థ్యంతోనే సాగుతుందా? లేక కేవ‌లం టైటిల్ ని మాత్ర‌మే తీసుకున్నారా? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.