యంగ్ డైరెక్టర్ లో క్రియేటివిటీ నచ్చితే చాలు తలైవార్ రజనీకాంత్ అవకాశం ఇచ్చేందుకు వెనకాడరు. ఆయన కెరీర్ లో అలా ఎందరికో అవకాశాలిచ్చారు. ఇంతకుముందు పా రంజిత్ కి కాలా- కబాలి చిత్రాలు చేసే అవకాశం కల్పించిన రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కి అవకాశం ఇస్తున్నారు. ఇటీవలే ఖైదీ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించిన లోకేష్ ట్యాలెంట్ రజనీకి విపరీతంగా నచ్చిందట. ఆ సినిమాతో ఆయనకు అవకాశాలు బాగా పెరిగాయి. స్టార్ హీరో విజయ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో మాస్టర్ అనే చిత్రం రూపొందుతోంది. ఇది పూర్తయ్యేలోపు రజనీ కూడా శివ చిత్రాన్ని కంప్లీట్ చేసేస్తారు. అంటే 2020 లోనే సెట్స్ కెళతారు. 2021లో రిలీజ్ ఉంటుందట.
ఈ సినిమాలతో పాటు.. త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్లనుండటంత త్వరత్వరగా సినిమాలు చేస్తున్న రజనీ యువదర్శకులకు అవకాశాలిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఖైదీ చిత్రంతో నిరూపించుకున్న లోకేష్ రజనీకి ఓ బ్లాక్ బస్టర్ ఇస్తారేమో చూడాలి.