కరోనా వైరస్ మహమ్మారీ దెబ్బకు ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఈ మహమ్మారిని తరిమి కోట్టాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఓవైపు ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి కరోనాని తరిమి కొడదాం అంటూ మొత్తుకుంటున్నాయి. మనిషికి మనిషే శత్రువు అని హెచ్చరిస్తున్నాయి. త్లలి…పెళ్లాం..బిడ్డ ఎవరైనా సరే దూరంగా ఉండాలనే డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా సోషల్ మీడియాలో బోలెడన్ని అవేర్ నెస్ కార్యక్రమాలతో సెలబ్రిటీలు చైతన్యం తీసుకొస్తున్నారు. కానీ మాజీ విశ్వసుందరి సోదరుడు ఏం చేశాడో చూశారా?
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవ్వడం ఇతగాడికి వేరొక రకంగా కలిసొచ్చిందట. పగలు..రాత్రి అనే తేడా లేకుండా పడకగది సుఖానికే అంకితమైపోయాడట. అంతటితో ఆగాడా? బెడ్ రూమ్ సీన్లను తెచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసి లాక్ డౌన్ ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ సిగ్గు లేకుండా చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ కరోనాకి భయపడక అంతగా బాధ్యతారాహిత్యంగా వ్యవరించే ఇతగాడు ఎవరు అంటే..!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్. ఈ టైప్ వేషాలతో అతడు ఇప్పటికే అందరికి సుపరిచితుడు. సోదరి ఇమేజ్ ను అడ్డుపెట్టుకుని గాళ్స్ లో వేషాలేయడం నిరంతరం హాట్ టాపిక్. అతడు రొమాంటి గాయ్ గా పాపులరయ్యాడు. కరోనా కల్లోలంలో ఇదిగో ఇలాంటి పాడుపని చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అసలు ప్రభుత్వ సూచనలేవీ పట్టించుకోకుండా భార్యతో రొమాంటిక్ వేషాల్లో బిజీగా ఉన్నాడు. నాలుగు గోడల మధ్యలో భార్యతో గడిపిన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అబాసు పాలయ్యాడు. ఆ ఫోటోలు చూసిన నెటిజనులు అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఇవేం రాసలీలలు అంటూ అక్షింతలు వేయించుకుటున్నాడు. మరి ఇప్పటికైనా అసలు విషయాన్ని చెవికి ఎక్కించుకుంటాడేమో చూద్దాం.