‘ఆర్ ఆర్ ఆర్’ బడ్జెట్ రివీల్ చేసి షాక్ ఇచ్చిన దానయ్య

ఈ రోజు జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్ లో దర్శకుడు రాజమౌళి తమ చిత్రానికి సంభందించిన కీలక విషయాలను వెల్లడించారు. సినిమా కథా కథనాలు, నటీనటులు వివరాలతో ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ కుసంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ భారీ చిత్రానికి సంభందించి బడ్జెట్ వివరాలును చెప్పారు. ఆ బడ్జెట్ విన్న వారంతా షాక్ అయ్యారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. సినిమా నిర్మాణానికి 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు. మరి బిజినెస్ ఎంత ఆశిస్తున్నారు అనే ప్రశ్నకు మాత్రం అది ఇప్పుడే ఎలా చెప్తాం ఫైనల్ గా అన్ని పూర్తయ్యాక వెల్లడి చేస్తాను అని చెప్పడం గమనార్హం.

ఇక ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంటే 100 కోట్లు ఇస్తామంటూ ఆఫర్‌ వచ్చిన మాట నిజమే అన్న దానయ్య రాజమౌళితో సినిమా చేయాలన్న కోరికతోనే ఈ ప్రాజెక్ట్‌ను విడిచి పెట్టలేదని తెలిపారు. 2019 డిసెంబర్‌ లేదా 2020 జనవరిలో షూటింగ్ పూర్తవుతుందని తరువాత ఆరు నెలల పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు చేసి జూలై 30 న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు.

అలాగే ప్రస్తుతానికి తెలుగు – తమిళ్ – హింది – కన్నడ – మలయాళం కలిపి మొత్తం 10 బాషల్లోకి ఆర్ ఆర్ ఆర్ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వచ్చే ఏడాది రిలీజ్ డేట్ లోపు ఈ సంఖ్యలో పెరుగుదల ఉండొచ్చని చెప్పారు.