చిరు, ప్రభాస్ గెస్ట్ లుగా.. : వైభవంగా ‘RRR’ లాంచ్ ..(ఫొటోలు)

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మల్టీస్టారర్‌ ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌)చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్‌.ఎస్‌ రాజమౌళి డైరక్ట్ చేయనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం నిర్వహించి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించినట్లు చిత్ర నిర్మాతలు సోషల్‌మీడియా ద్వారా తెలియచేసాయి. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక అనుకున్న ముహూర్తం 11వ నెల, 11వ తేదీ ఉదయం 11 గంటలకు వైభవంగా రాజమౌళి ‘RRR’ లాంచింగ్ పూర్తైంది.

 

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్క్రిప్ట్ అందజేశారు. చిరంజీవి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గడ్డంతో సేమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. రానా, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంభందించి… ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాకు ‘రామ రావణ రాజ్యం’, ‘తారక్‌రామ్‌’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారని సమాచారం.

ఈ చిత్ర షూటింగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీని రాజమౌళి మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకున్నారని సమాచారం. అయితే టైటిల్ విషయమై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాలేదు.

సినిమాలోని హీరోయిన్స్, మిగతా నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ‘RRR’ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.