జక్కన్న మ్యాజిక్.. ఎన్టీఆర్ చేతిలో చిరుత పులి ప్లేస్ లో బాల్ ని పెట్టేసాడు.!

ఇప్పుడు ప్రతి చిన్న సినిమాలో కూడా ఏదో ఒక చిన్న గ్రాఫికల్ వర్క్ అయినా కూడా కనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఈ టెక్నాలజి సినిమాలో ఇమిడిపోయింది. మరి ఈ విజువల్స్ పరంగా అయితే మన దేశంలో చాలా సినిమాలే వచ్చాయి ఇంకా వాటిలో దర్శక ధీరుడు రాజమౌళి నుంచి కూడా పలు భారీ చిత్రాలే ఉన్నాయి.

మరి ఆ చిత్రాల్లో లేటెస్ట్ గా భారీ సినిమాలు బాహుబలి సిరీస్ మరియు రీసెంట్ రిలీజ్ ట్రిపుల్ ఆర్(RRR) లో ఇంకా బెటర్ గా చూపించాడని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచే అనేక సన్నివేశాలు పూర్తిగా గ్రాఫిక్స్ తోనే కనిపిస్తాయి కానీ అవేవి గ్రాఫిక్స్ లా ఉండవని చెప్పాలి.

మరి ఈ సీన్స్ లో ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ పై కనిపించే అన్ని సీన్స్ కూడా అదిరే గ్రాఫిక్స్ తో ఉంటాయి. అయితే ఇందులో ఎన్టీఆర్ ఒక చిరుతపులిని తన మీద పడిన దాన్ని చేత్తో పట్టుకొని ఓ బ్రిటిష్ సైనికుడి మీదకి విసురుతాడు.

మరి సీన్ ని జక్కన్న ఒరిజినల్ గా ఎలా తీసాడో ఇప్పుడు ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ రివీల్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ చేతిలో చిరుత ప్లేస్ లో ఏముందంటే ఒక ఫుట్ బాల్ ని పెట్టేసారు దాన్ని ఎన్టీఆర్ విసరగా ఫైనల్ అవుట్ పుట్ లో చిరుతగా చేసేసారు.

ఇప్పుడు ఈ వీడియో మంచి వైరల్ గా మారింది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్, అజయ్ దేవగన్ అలాగే ఆలియా భట్ తదితరులు నటించగా కీరవాణి సంగీతం అందించారు ఆలాగే డీవీవీ దానయ్య నిర్మించారు.