మీటూ .. రేప్ .. వేధింపులు అంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు చిన్మయి సహా పలువురు నటీమణుల ఆరోపణలు వేడెక్కించాయి. అయితే ఈసారి మేల్ వెర్షన్ సంచలనమైంది. తనపై బాల్యంలో లైంగికదాడులు జరిగాయని కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్ చేసారు. “గతం ఎప్పటికీ గుర్తుంటుంది. మర్చిపోదామని ప్రయత్నించినా మర్చిపోలేని భయానక అనుభవాలు ఇవి. మహిళలకే కాదు… బాల్యంలో పురుషులకు కూడా సరైన రక్షణ లేదు. నేను చిన్న వయసులో ఇబ్బంది పడ్డవాడినే. ఇలాంటి వాటిని తలుచుకుంటే భయమేస్తుంది. మన పిల్లలు ఎంత సెక్యూర్డ్ గా ఉన్నారు అన్నది తలుచుకుంటే భయం కలిగిస్తోంద“ని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ పై టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి స్పందించారు. ఇలాంటి వాటిని బయటపెట్టడం వల్ల ఎంతో మందిలో అవేర్ నేస్ తీసుకొచ్చిన వాళ్లం అవుతామని ప్రశంసించారు.
ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా చిన్నపిల్లలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కఠినంగా శిక్షలు అమలు చేసినా కామాంధుల లైంగిక దాహానికి అమాయకులు బలవుతునే ఉన్నారు. ఇది కేవలం కమెడియన్ రాహుల్ సమస్య మాత్రమే కాదు. ఇలా చిన్న వయసులో లైంగింకంగా వేధింపడిన వారు చాలా మంది ఉండొచ్చు. కానీ రాహుల్ మాత్రమే తనపై జరిగిన ఘటనపై ఓపెన్ గా మాట్లాడి అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనిని మెచ్చుకోవాల్సిందే.