హీరోయిన్ బోయ్ ఫ్రెండ్స్ మధ్య గొడవ, బీరు బాటిల్ తో తలపై కొట్టేసాడు

సినిమాల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూస్తూంటాం. ఒకమ్మాయి కోసం ఇద్దరు బోయ్ ఫ్రెండ్స్ పోరాడటం గమనిస్తాం. కానీ నిజ జీవితంలోనే అలాంటి సంఘటన ఒకటి జరిగి హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఓ సినీ హీరోయిన్ కోసం కావటం మరో విశేషం.

వివరాలలోకి వెళితే.. కన్నడ హీరోయిన్‌ రాగిణి ద్వివేది కోసం ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్, ప్రస్తుత బోయ్ ఫ్రెండ్ పరస్పరం దాడి చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి బెంగుళూరు నగరంలోని రిట్జ్‌ కార్టన్‌ హోటల్‌కు హీరోయిన్‌ రాగిణి ఆర్టీఓ శాఖలో అధికారిగా పని చేస్తున్న రవి అనే వ్యక్తితో కలసి వెళ్లారు. అతను ఆమె ప్రస్తుత బోయ్ ఫ్రెండ్ గా చెప్పబడుతున్నాడు.

అదే సమయంలో అదే హోటల్‌లో రాగిణి మాజీ బోయ్ ప్రెండ్, బిజినెస్ మ్యాన్ శివప్రకాశ్‌ ఫ్రెడ్స్ తో కలసి పార్టీ చేసుకుంటున్నాడు. కాగా తమ మధ్య తలెత్తిన మనస్పర్థలతో తనను వదిలేసిందనే కారణంగా రాగిణిపై ద్వేషం పెంచుకున్న శివప్రకాశ్, రాగిణి అదే హోటల్‌కు రవితో రావడాన్ని చూసి కోపాన్ని అదుపు చేసుకోలేక రాగిణితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రవి, శివప్రకాశ్‌ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

ఇరువురి మధ్య గొడవ శృతి మించడంతో శివప్రకాశ్‌ బీర్‌ బాటిల్‌తో రవిపై దాడి చేశాడు. గమనించిన హోటల్‌ సిబ్బంది ఇరువురిని విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. గొడవపై రాగిణి, రవిలు అశోకనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి తనకు కనపడితే చంపేస్తానంటూ శివప్రకాశ్‌ బెదిరించాడంటూ రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్‌లో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి శివప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే ఈ గొడవ అంతటీకి కారణం రవి భార్య అని తెలుస్తోంది. రాగిణి కోసం హోటల్‌కు వెళ్లే సమయంలో రవి భార్య రవికి ఫోన్‌ చేసి రాగిణితో తిరుగుతుండడంపై గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆమే శివ ప్రకాష్ కు ఫోన్ చేసి ఈ గొడవకు మూలం అయ్యిందని చెప్పుకుంటున్నారు.