లారెన్స్ ఇలా ఉన్నాడేంటి?

రాఘవా లారెన్స్‌ మరోసారి భయపెట్టేందుకు సిద్దపడుతున్నాడు. ‘ముని’ సిరీస్‌లో భాగంగా ‘కాంచన 3’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నాడు. లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలు ఆరంభించారు. ఇందులో భాగంగా తాజాగా సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ ట్రైలర్ లో లారెన్స్ గెటప్ చూస్తూంటే ఆయనే దెయ్యంలా ఉన్నాడని అంటున్నారు. 

Kanchana 3 Telugu Trailer || Raghava Lawrence || Oviya || Vedhika

ముని సిరీస్‌లోని గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరింతగా భయపెడుతుందనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తూంటే. లారెన్స్‌ విభిన్నమైన గెటప్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహన్‌ సింగ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, సత్యరాజ్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముందుగానే పూర్తవుతుండటంతో ఏప్రిల్ లోనే సినిమాను రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ 19న కాంచన 3 ప్రేక్షకుల ముందుకు రానుంది.