తెలుగులోనూ సినిమాలు చేసిన రాధిక ఆప్టే ఏదో ఒక వివాదం లేనిదే నిద్రపట్టదల్లే ఉంది. ఆమె నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నట్లే ఉంటుంది. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ హీరో తనతో అభ్యంతరకరంగ వ్యహరించారని రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా పక్కన పెట్టి సీరియస్ సినిమాల్లో బోల్డ్‌గా నటించేందుకు సిద్ధపడిన దాఖలాలు ఉన్నాయి. అదే వరసలో తాజాగా రాధిక మరో వివాదానికి తెర తీసింది. తన కో ఆర్టిస్ట్ ఒకరు ..నడుముకు మసాజ్ చేస్తానంటూ కామెంట్స్ చేసారంటూ చెప్పుకొచ్చింది.
కాస్టింగ్ కౌచ్ వివాదంపై రాధిక ఆప్టే మాట్లాడుతూ…”ఆ మధ్యన ఓ సినిమా చేస్తూంటే…షూటింగ్ టైమ్ లో నాకు నడుము నొప్పి వచ్చింది. అయినా.. ఆరోజుంతా దాన్ని భరించి షూటింగ్ పూర్తి చేశా. షూటింగ్ పూర్తయిన తరువాత రూమ్ కి వెళ్తూంటే మా సినిమాలో నటిస్తోన్న మరో నటుడు లిఫ్ట్ లో నాతోపాటు ఎక్కాడు.
అతను నన్ను చూసి….ఏదైనా సహాయం కావాలంటే చెప్పు. అర్ధరాత్రి అయినా వచ్చి నడుము మసాజ్ చేస్తానని అసభ్యకరంగా మాట్లాడాడు” అంటూ రాధిక చెప్పుకొచ్చింది. అయితే ఆ విషయాన్ని తను దర్శక,నిర్మాతలకు తెలియచేసానని వారు అతన్ని పిలిచి మందలించారని వివరించింది. ఆ తర్వాత అతను వచ్చి క్షమాపణ చెప్పి ,తనతో ఎప్పుడూ మిస్ బిహేవియర్ చేయలేదని చెప్పుకొచ్చింది.