ఒక దర్శకుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది. ఒక దర్శకుడు కథ రాసుకోవడం స్టార్ట్ చేయడానికి ముందు ఎదో ఒక విషయం నుంచి స్ఫూర్తి పొందకుండా ఉండలేడు. ఎదుటి మనిషి బాధను, సంతోషాన్ని అలాగే కోపాన్ని కసిని పేపర్ పై ఒక కథలగా రాయడం ఈజీ కావచ్చు. కానీ అదే కథను సినిమాగా వెండితెరపై అవిష్కరించాలి అంటే చాలా కష్టమైన పని. కానీ జూనియర్ ఎన్టీఆర్ తో సుక్కు ఎలా మాట్లాడాడో గాని అతని కథనే సినిమాగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు.
పాన్ ఇండియక్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న పుష్ప సినిమా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నప్పటికి అందులో ఒక స్పెషల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఉందట. అలాగే ఉన్నతమైన కుటుంబానికి దూరంగా ఉండే ఒక కుర్రాడి కసిని కూడా సినిమాలో చూపించనున్నారట. జూనియర్ ఎన్టీఆర్ బాల్యంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తండ్రికి దూరంగా ఉంటూ తల్లి వద్దనే ఉంటూ నాట్యం నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ కసితోనే పెద్దగా సపోర్ట్ లేకుండా టాలెంట్ తో తానేంటో నీరూపించుకున్నాడు.
ఇక ఆ కసిని విభిన్న కోణంలో కథగా మార్చుకున్న సుకుమార్ కు మొదటి ఆలోచన వచ్చేలా చేసింది జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ సుకుమార్ తో నాన్నకు ప్రేమతో అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారట. ఒక స్నేహితుడిగా భావించి తారక్ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించడంతో అందులోనే మంచి కథ ఉందని పుష్పలో మిక్స్ చేసి కొట్టినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.