చిరంజీవి మెగాస్టార్ కాకముందు సుప్రీం హీరో. సుప్రీం హీరోగా సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి అప్పటికే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి వాళ్లు ఉన్నా.. తన స్వయం కృషితో హీరోగా ఎదిగారు.
ఇండస్ట్రీలో అంతమంది హీరోలు ఉన్నా తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. అంతే కాదు.. వరుస హిట్లతో దూసుకుపోతున్న సుప్రీం హీరోకు మెగాస్టార్ అయితే కరెక్ట్ గా సరిపోతుందని భావించారు ఓ నిర్మాత. ఆ నిర్మాత కూడా బడా నిర్మాతే.
చిరంజీవితో చాలా సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆ నిర్మాతే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ఇచ్చారు. దీంతో సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ గా మారారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరంటే.. కేఎస్ రామారావు.
తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో చిరంజీవితో కేఎస్ రామారావు ఎన్నో సూపర్ డూపర్ సినిమాలను చేశారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి అగ్రహీరోలు ఉన్నా… చిరంజీవితో కేఎస్ రామారావు అద్భుతమైన చిత్రాలను నిర్మించారు.
వాళ్లిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా అభిలాష. ఆ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా. ఆ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆ సమయంలో అభిలాష తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద హిట్టు.
ఆ తర్వాత ఛాలెంజ్ సినిమా. ఇది కూడా సేమ్ ఫార్మాట్. యండమూరి నవల ఆధారంగానే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చి బాక్సీఫీసునే బద్దలు చేసింది ఈ సినిమా.
ఆ తర్వాత రాక్షసుడు, మరణ మృదంగం లాంటి సినిమాలు వచ్చాయి. మరణ మృదంగం సినిమా సమయంలోనే నిర్మాత కేఎస్ రామారావు.. సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవిని మెగాస్టార్ గా మార్చారు. దీంతో ఆ తర్వాతి సినిమాల నుంచి సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ అయ్యారు.