నోరు మూయించిన ప్రియాంక చోప్రా

లాస్ ఏంజిల్స్‌లో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అభిమానుల ప్రశ్నలకు ప్రియాంక చోప్రా సమాధానం ఇచ్చేటప్పుడు ఓ పాకిస్థానీ యువతి గట్టిగా అరుస్తూ, దురుసుగా ప్రవర్తించారు. అయితే దానికి ప్రియాంక తెలివిగా దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పి ఆమె నోరు మూయించారు.పాకిస్థాన్ మహిళ మాట్లాడుతూ నేను ఓ పాకిస్థానీ మహిళనైనా.. నాదేశ వాసులతో మీరు చేసిన మంచి పనులకు మద్దతిచ్చాం. భారత బలగాలు సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పుడు మీరు `జైహింద్` అంటూ ట్వీట్ చేశారు. యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మీరు అలా చేయడం కరెక్టా? అని కేకలు వేశారు. దీనిపై ప్రియాంక మాట్లాడుతూ నేను భారతీయురాలిని. నా దేశం పట్ల బాధ్యత, గౌరవం ఉన్నాయి. నాకు పాకిస్థాన్‌లోనూ చాలా మంది స్నేహితులున్నారు. నేను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నీ దేశం కోసం నువ్వెలా ప్రశ్నిస్తున్నావో నేను కూడా అంతే. ఇలా అరిచి నీ పరువు తీసుకోకు. ఇక్కడ మనమంతా ప్రేమగా వ్యవహరించాలి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. నేనున్న స్థాయిలో ఇతర మహిళలను ప్రోత్సహించి, వారిని ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని సమాధానమిచ్చి సదరు పాకిస్థానీ మహిళ నోరు మూయించారు ప్రియాంక చోప్రా