ప్రియ వెర్సస్ సన్నీ: ఫుటేజీ పాట్లు

బిగ్ హౌస్‌లో సన్నీ మొదట్నుంచీ మంచి ఎంటర్‌టైనర్ అనిపించుకుంటున్నాడు. కానీ, ఇన్నాళ్లూ సన్నీకి ఏమంత ఎక్కువగా స్ర్కీన్ స్పేస్ దొరికిందని చెప్పలేం. అయితే, ఈ వారం మొత్తం ఎపిసోడ్ సన్నీ మీదే జరగడం విశేషం. ముఖ్యంగా సన్నీ అందరికీ ఈజీగా టార్గెట్ అయిపోతున్నాడు.

సన్నీని టార్గెట్ చేసి, అతనితో గొడవ పెట్టుకుంటే స్క్రీన్ స్పేస్ బాగా దొరుకుతుందని భావించిన హౌస్ మేట్స్ అందరూ సన్నీని కెలికుతూ సరికొత్తగా ఫుటేజ్ దక్కించుకుంటున్నారు. పాపం ఈ సంగతి తెలియని సన్నీ, జెన్యూన్‌గా తన గేమ్ తాను ఆడుకుంటూ పోతున్నాడు.

ఇక, ప్రియ విషయానికి వస్తే, మొదట్నుంచీ ఎవరో ఒకరిపై బేస్ అయిపోయి, స్పేస్ దక్కించుకోవడమే ఈమె గేమ్ స్ర్టాటజీ. ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తానని డైరెక్ట్‌గా చెప్పి మరీ తెలివిగా గేమ్ ప్లాన్ చేసుకుంటోంది. అలా ఈ వారం మొత్తం ఆమె టార్గెట్‌కి బలైపోయాడు సన్నీ. ఇక తదుపరి ప్రియా టార్గెట్ ఎవరనేది తెలియాల్సి ఉంది.