డైరక్టర్ కు వార్నింగ్…అవన్నీ బయిటపెట్టనా?

“అసలేం జరిగిందో బయటపెడితే కొందరి పేరు, ప్రతిష్టలు మంటగలసిపోతాయి. తల ఎత్తుకు తిరగలేరు. విమర్శలన్నింటికీ భవిషత్తులో కర్మ సమాధానం చెబుతుంది అని ప్రియా తెలిపింది. ఆ సమయం దగ్గర్లోనే ఉంది” అంటూ ప్రియా వారియర్ తనపై కామెంట్స్ చేసిన డైరక్టర్ కు డైరక్ట్ కౌంటర్ ఇచ్చింది. దాంతో అంతలా పేరు ,ప్రతిష్టలు, మంటగలిసిపోయే పని ఆ దర్శకుడు ఏం చేసాడన్నది అంతటా హాట్ టాపిక్ గా మారింది.

లవర్స్ డే చిత్తరం కథని మార్చడం, ప్రియా వారియర్ ని హీరోయిన్ గా చేయడం వల్లే తమ చిత్రం నిరాశపరిచిందని దర్శకుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ఇక మరో హీరోయిన్ గా చేసిన నూరిన్ షరీఫ్ కూడా ప్రియా వారియర్ పై విమర్శలు గుప్పించింది. ప్రియా వారియర్ వల్ల తనకు దక్కాల్సిన పేరు దక్కలేదని నూరిన్ అసహనం వ్యక్తం చేసింది. ఈ విమర్శలపై తాజగా ప్రియా వారియర్ పై విధంగా స్పందించింది.

అసలేం జరిగింది

కన్ను గీటి యావత్ భారతదేశాన్ని తన కను సన్నల్లో తిప్పుకున్న బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె వల్లే తమ సినిమా సర్వ నాశనం అయ్యిందంటున్నారు దర్శకుడు ఒమర్. ప్రియా ప్రకాష్ న‌టించిన తొలి సినిమా ల‌వ‌ర్స్ డే డిజాస్టర్ కు ఆమెను కారణం చేస్తూ మీడియా ముందు మాట్లాడారు.

‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో అనుకోకుండా కన్నుకొట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ సంచ‌ల‌నం అయిపోయిందని.. అదే తమ సర్వ నాశానానికి దారితీసిందని అన్నారు. ఆ కన్ను కొట్టే సీన్ సెన్సేషన్ కావడంతో నిర్మాత‌లు కూడా త‌మ బిజినెస్ పెరగటం కోసం సినిమా క‌థ కూడా మార్పించేసార‌ని.. స్క్రిప్ట్ ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిప్పేసి తన కెరీర్ కే దెబ్బకొట్టారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఒమ‌ర్.

ఆ పాట హిట్ అవగానే ..తాను నిర్మాతను కలిసి క్రేజ్ వచ్చింది కాబట్టి మంచి క్వాలిటీతో సినిమా తీద్దామని రిక్వెస్ట్ చేసానని, కానీ తన మాట ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. మళయాళ , తెలుగు నిర్మాతలు ఇద్దరూ ఎట్టి పరిస్దితుల్లోనూ ప్రియ ప్రకాష్ నే హీరోయిన్ గా మెయిన్ లీడ్ గా పెట్టాలని పట్టుబట్టారని అన్నారు. దాంతో మొత్తం రీషూట్ చేసామని చెప్పుకొచ్చారు.

ఇంత తాము కష్టపడినా ప్రియా ప్రకాష్ మాత్రం సినిమా విడుదలైన తరువాత ప్రమోషన్స్ కి రాలేదని.. ఆమె ప్రచారం చేసి ఉంటే వసూళ్లు పెరిగి ఉండేవని అన్నారు. ప్రియాప్రకాష్ కి నటన రాదని ఆమెతో ఎక్సప్రెషన్స్ పలికించలేకపోయానని, కాసేపు కనబడే పాత్ర కాబట్టి తీసుకున్నానే కానీ హీరోయిన్ వేషమైతే ఇచ్చేవాడినే కాదని డైరక్టర్ … మండిపడ్డారు.