మళ్లీ ఆ మ్యాజిక్ జరుగుతుందా..ఆ స్దాయి హిట్ వస్తుందా?

కొన్ని సూపర్ హిట్ చిత్రాలను ..సీక్వెల్ తీయటమో లేక పార్ట్ 2 అంటూ కొనసాగింపు చెయ్యటమో చేస్తూంటారు. వాటిని క్యాష్ చేసుకునే ప్రాసెస్ అది. అయితే దాదాపుగా సినిమాని అమ్మేసుకోగలుగుతారేమో అని హిట్ కొట్టడం అనేది మాత్రం జరగదు.

మారుతి రచనా, దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘ప్రేమ కథా చిత్రమ్’ఓ  ట్రెండ్‌ని క్రియెట్ చేసింది. హారర్ కామెడీలు వరస పెట్టి ..ఇప్పటిదాకా ఆ ట్రెండ్
కొనసాగుతోంది. అయితే ఆ స్దాయి విజయం ఎవరూ సాధించలేకపోయారు. దాంతో కాస్త ఆ తరహా చిత్రాల జోరు తగ్గింది. కానీ  ‘ప్రేమ కథా చిత్రమ్’నిర్మాతలు మాత్రం మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యాలనుకుంటున్నారు.  ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ సినిమాని మొదలెట్టారు. చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిధ్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు.

‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజయదశమి సందర్భంగా ఈ చిత్ర మెద‌టిలుక్‌ని విడుద‌ల చేశారు. ’బ్యాక్ టూ ఫియర్’ అనే క్యాప్షన్‌తో ఇప్ప‌టికే 90% షూటింగ్ పూర్తిచేసుకుని మ‌రో రెండు పాట‌లు, క్లైమాక్స్ మిన‌హ షూటింగ్ పార్ట్‌ని పూర్తిచేసుకుందీ సినిమా. అతి త్వరలో అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల‌ చేయాలని స‌న్నాహ‌లు చేస్తున్నారు.