ప్రకాష్ రాజ్ ..సప్తగిరిని కొట్టాడని డైరక్టర్ ఒప్పుకున్నట్లే!

ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్న అంశం ఏమిటీ అంటే ప్రకాష్ రాజ్ ..కమిడియన్ సప్తగిరిని చెంపపై కొట్టాడా లేదా అనేది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా షూటింగ్ లో  ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు.

తనతో కలిసి నటిస్తోన్న కమెడియన్ సప్తగిరిపై ప్రకాష్ రాజ్  చేయి చేసుకున్నట్లుగా వార్తలు బయటకి వచ్చాయి.  సప్తగిరి కాస్త ఓవర్ చేసాడని
చిరాకుపడ్డ ప్రకాష్ రాజ్ హెచ్చరించాడని, అయితే తన స్పీడుని తగ్గించుకోని సప్తగిరిని కోపంలో ఒక్కటిచ్చాడని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటికే ప్రకాష్ రాజ్ ..అటువంటిదేమీ జరగలేదని స్టేట్ మెంట్ ఇచ్చేసాడు.

 దిల్ రాజు..ఏకంగా అసలు అలాంటివి ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్ ఎందుకు చేస్తాడు..అదీ నా లాంటి పెద్ద నిర్మాత ఉన్న సెట్ పై అన్నట్లుగా మాట్లాడేసాడు. అయితే సప్తగిరి మాత్రం నోరు విప్పలేదు. వీళ్లందరి సంగతి ప్రక్కనపెట్టి…డైరక్టర్ నక్కిన త్రినాధరావుని అసలు ఏం జరిగింది అంటే..ఆ టైమ్ లో నేను అక్కడ లేను అన్నాడు. అంతేకానీ ప్రకాష్ రాజ్ కొట్టలేదు అని ఖండించలేదు. ద్యావుడా అసలు ఏం జరుగుతోంది అక్కడ…నిజం ఏమిటి..ఒక్కరూ చెప్పరా లేక పబ్లిసిటి స్టంటా…వాటీద్ దిస్సమ్మా రామ్.