రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. అతను ఎప్పుడూ వార్తల్లో వుండాలని కోరుకుంటాడు, ఆ దిశగానే తన ప్రయాణం కొనసాగిస్తాడు. తాజాగా వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా ప్రకటన తెలుగు దేశం వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నది. నిజానికి ఎంటర్ బయో పిక్ సినిమాకు సంబంధించి మూడు ప్రకటనలు వచ్చాయి. ఒకటి బాలకృష్ణ “ఎన్టీఆర్ “, మరొకటి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి “లక్ష్మీస్ వీరగ్రంధం” మూడవది రామ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్ “. ఈ మూడు కూడా విభిన్నమైన కోణాల కథలే.
బాలకృష్ణ నిర్మించే “ఎన్టీఆర్ ” చిత్రంలో ఎన్టీఆర్, చంద్ర బాబు నాయుడు పాత్రలు హై లైట్ చేశారు. వర్మ సినిమాలో లక్ష్మి పార్వతి పాత్రకు ప్రాధాన్యత వుంది. ఎన్టీఆర్ ను మహోన్నత నాయకుడుగా చూపించి, చంద్ర బాబును వెన్నుపోటు దారుగా, మామను మోసం చేసిన వాడుగా చిత్రించే ప్రయత్నం జరుగుతుందని తెలిసింది.
ఇక జగదీశ్వర రెడ్డి “లక్ష్మీస్ వీరగ్రంధం ” సినిమాలో లక్ష్మి పార్వతిని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు స్వయంగా జగదీశ్వర రెడ్డి తెలిపాడు. అయితే ఈ చిత్రం ప్రారంభించి డబ్బులు లేక ఆపేసాడు. రామ గోపాల వర్మ ప్రకటన అయితే చేసాడు కానీ చిత్రం షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాత.
అయితే హఠాత్తుగా వర్మ ఈ సినిమా విజదశమికి, తిరుమల వెనెకటేశ్వర స్వామి సన్నిధిలో 19న మొదలు పెడుతున్నట్టు ప్రకటించాడు. ఇదే సమయంలో చంద్ర బాబు పోలికలు వున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాడు. హోటల్లో పని చేసే అతను అచ్చు చంద్ర బాబులా వున్నాడు.
అతని ఆచూకీ తెలిపిన వారికి అక్షరాలా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించాడు . సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ అంటే 24 గంటలు గడవక ముందే అతన్ని రామ గోపాల్ వర్మ దగ్గరకు చేర్చింది . అతని పేరు ప్రభు , త్రియంబకేశ్వరం లో ఉంటాడు . అతని కుటుంబాన్ని వర్మ రెండు లక్షలు ఇచ్చినట్టు సమాచారం . ప్రభు కు రామ గోపాల్ వరం నటనలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిసింది . తెలుగు దేశం పార్టీ నేతల్లో, ముఖ్యంగా “ఎన్టీఆర్ బయో పిక్ ” చిత్ర వర్గాల్లో వర్మ దడ పుట్టిస్తున్నాడు .