ప్రభాస్ ఇప్పుడంటూ ఇంటిపట్టున ఉంటూ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు గల్ప్ కంట్రీస్‌లోనే ఉన్నారు. ఇంకో రెండు నెలల్లో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్‌కి వెళ్లనున్నారు. మొన్న గల్ఫ్‌లో తిరిగినా, రేపు యూరోపియన్ కంట్రీస్‌ని చుట్టొచ్చినా అది పర్సనల్‌గా ఎంజాయ్ చేసే ట్రిప్పులు మాత్రం కావు. అదంతా `సాహో` సినిమా కోసం. `బాహుబలి` ఫ్రాంచైస్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా `సాహో`. భారీ అంచనాల మధ్య మల్టీలింగ్వుల్ ప్రాజెక్ట్ గా సాహో సిద్ధమవుతోంది. ఈసినిమా కోసం డిసెంబర్‌లో ఆయన ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్‌కి వెళ్తారు.
అక్కడ శతాబ్దాల తరబడి నిలిచి ఉన్న కట్టడాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాలన్నది దర్శకుడు సుజిత్ ప్లాన్ అట. ఈ సినిమాలో అంతర్జాతీయ గజదొంగగా ప్రభాస్, ఆయన్ని పట్టుకోవడానికి కృషి చేసే పోలీస్ ఆఫీసర్‌గా శ్రద్ధ నటిస్తున్నట్టు సమాచారం. నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. రూ.200కోట్ల వ్యయంతో రూపొందుతోన్న సినిమా ఇది. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం తర్వాత వారు సంగీతాన్ని సమకూరుస్తున్న సినిమా ఇదే. వచ్చే జూన్, జులైలో సినిమాను విడుదల చేయాలన్నది ప్లాన్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు కూడా మొదలైనట్టు సమాచారం.