‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ చాలా పెద్ద త్యాగం చేశాడు.. వావ్ అంటున్న ప్రభాస్ ఫాన్స్..!

prabhas to learn archery for Adipurush bollywood movie

ఇది కిక్కంటే. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ మాత్రం కిక్కులేకుంటే ఎట్లా. ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజూ ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉన్నది. ఆ అప్ డేట్ ఎలా ఉంటున్నదంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఉంటున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబురాలు మామూలుగా ఉండట్లేవు.

prabhas to learn archery for Adipurush bollywood movie
prabhas to learn archery for Adipurush bollywood movie

నో డౌట్.. ప్రభాస్ మరోసారి భారతదేశ సినీ రికార్డులను తిరగరాయడం ఖాయం. బాహుబలి రికార్డులు కూడా ఈసారి బద్ధలు కావాల్సిందే. అందులో అనుమానమే లేదు.. అంటూ ఎంతో భరోసాగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

ఇక.. ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా విలు విద్యను నేర్చుకోబోతున్నాడట. ఈ సినిమా రామాయణం ఇతిహాసానికి సంబంధించిందని అందరికీ తెలిసిందే. ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. రాముడు అంటేనే విలువిద్యలో ఆరితేరిన వ్యక్తి. ఎవరినైనా తన బాణంతో మట్టికరపగల వ్యక్తి.

అందుకే.. ప్రభాస్ విలువిద్యలో ప్రావిణ్యం సంపాదించబోతున్నాడన్నమాట. అంతే కాదు.. రాముడి పాత్ర కోసం ప్రభాస్ తన శరీరాకృతిని కూడా మార్చుకోబోతున్నాడట. ఇక.. ప్రభాస్ కు విలువిద్యలో ట్రెయినింగ్ ఇచ్చేందుకు థాయ్ లాండ్ నుంచి ట్రెయినర్ ను రప్పించనున్నారట.

ఇక ఈ సినిమా మొత్తం బడ్జెట్ 1000 కోట్లు కాగా.. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సరసన కీర్తి సురేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. 2021లో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమా… 2022లో విడుదల కానుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే.

ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుండగా… ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ జరగనుంది.