డార్లింగ్ ప్రభాస్ పారితోషికంపై రకరకాల గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత పెద్ద పారితోషికం అందుకునే ఏకైక స్టార్ గా ప్రభాస్ రికార్డులు తిరగరాయనున్నాడనేది ఇన్ సైడ్ టాక్. అన్నట్టు ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రానికి ఎంత పారితోషికం అందుకుంటున్నాడు? అంటే..
రాధేశ్యామ్ (ప్రభాస్ 20) సొంత బ్యానర్ సినిమా కాబట్టి అది ప్రభాస్ ఇష్టం. కానీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్న ప్రభాస్ 21 కి మాత్రం దిమ్మతిరిగే పారితోషికం డిమాండ్ చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి దత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ప్రభాస్ కి 70 కోట్ల పారితోషికం సహా దాంతో పాటే పొరుగు భాషల్లో రిలీజ్ చేస్తే డబ్బింగ్ రైట్స్ లో సగం వాటా (50శాతం) తనకే చెందాలని కండీషన్ పెట్టాడట. ఆ ప్రకారమే దత్ బృందం అంగీకరించారని తెలుస్తోంది. ఇప్పటికే కథానాయిక దీపిక పదుకొనేకు 18 కోట్ల నుంచి 20కోట్ల మేర పారితోషికం అందనుందని కథనాలొచ్చాయి. దీపికతో పోలిస్తే ప్రభాస్ ఐదు రెట్లు అధికంగానే అందుకోనున్నాడు. ఏ రకంగా చూసినా ప్రభాస్ తన కెరీర్ 21వ సినిమాకి 100 కోట్లు అందుకుంటున్నట్టేననేది విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రస్తుతం ఈ వార్త ప్రభాస్ అభిమానుల్ని షేక్ చేస్తోంది. కేవలం నాయకానాయికలకే 100 కోట్లు పైగా పారితోషికాలు ముట్టజెబుతున్న అశ్వనిదత్ ఈ మూవీపై ఏ రేంజ్ బడ్జెట్ పెడతారు? అన్నది ఊహిస్తేనే అగ్గి రాజుకుపోవడం లేదూ? ఓ వైపు కోవిడ్ విలయంతో వినోద పరిశ్రమలు అట్టుడుకుతుంటే ఈ గాసిప్పులు కంటికి కునుకు పట్టనివ్వడం లేదు!!